Devotional News : శివలింగానికి, నందీశ్వరుడికి మధ్య మనుషులు నడవకూడదంటారు ఎందుకు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Devotional News : శివలింగానికి, నందీశ్వరుడికి మధ్య మనుషులు నడవకూడదంటారు ఎందుకు?

 Authored By pavan | The Telugu News | Updated on :21 March 2022,6:00 am

Devotional News : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఒక్కో గుడికి వెళ్లినప్పుడు ఒక్కో విధంగా నడుచుకుంటాం. మన హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం ఏ దేవుడికి పూజ ఎలా చేయాలి.. ఏ దేవుడికి ఏం ఇష్టం, అక్కడ నడుచుకోవాల్సిన విధి విధానాల గురించి తెల్సుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే శివుడి గుడికి వెళ్తే అభిషేకం, హనుమంతుడి గుడికి వెళ్తే సింధూరం పెట్టించి ప్రత్యేక పూజ చేయించడం.. గ్రామ దేవతలు అయితే కోళ్లు, మేకలు బలి ఇస్తూ ఇలా వివిధ రకాలుగా దేవుళ్లను కొలుస్తుంటాం. కానీ శివుడి గుడికి వెళ్లినప్పుడు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు మన పెద్దలు. అందుకు కారణం… శివాలయంలో ఉండే శివ లింగానికి, నందీశ్వరుడికి మధ్య మనుషులు నడవకూడదు కాబట్టి.

మనం చూసుకోకుండా వెళ్లినా, లేదా తెలిసి వెళ్లినా మనకు మంచి జరగదని చెబుతుంటారు. అందుకే మనం శివాలయానికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా నడుచుకుంటాం. అయితే అసలు నిజంగానే అలా నడకూడదా నడిస్తే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మన పురాణ గాథల ప్రకారం ఏజయర్ద్వియోర్మధ్యే నంది శంకర యోరపి అనే ప్రమాణం ఉంది. అంటే మేక పోతుల మధ్య, ద్విజుల మధ్య, నంది శంకరుల మధ్య నడవరాదని అర్థం. ఆ పురాణాల ప్రకారమే మన పెద్దలు నంది, శివ లింగాల మధ్య నడవకూడదని చెబుతారు. అయితే శివుడు భక్తాను గ్రహ తత్పరుడు. అలాగే నందీశ్వరుడు శివ భక్తుల్లో అగ్ర గణ్యుడు. అంటే శివుడిని ఆరాధించడంలో నందీశ్వరుడి తర్వాతే మిగతా వారంతా.

what is the reason behind people walk between shivalingam and nandeeshwara

what is the reason behind people walk between shivalingam and nandeeshwara

ఆ ప్రేమతోనే ఆ భోళా శంకరుడికి వాహనంగా మారాడు నందీశ్వరుడు. శివుడి పాద పద్మాలను ఎడ తెగకుండా నందీశ్వరుడు దర్శిస్తుంటాడు. శంకరుడు గూడా అవిశ్ఛినంగా భక్తాగ్ర గణ్యుడైన నందీశ్వరుని అనుగ్రహ దృష్టిని ప్రసరింప జేస్తుంటాడు. వీరిరువురి మధ్య మానవులు నడిస్తే వారి పరస్పర దృష్టి ప్రసారానికి విచ్ఛేదం ఏర్పడుతుంది. అలా జరిగితే వారిపై వీరిద్దరికి కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా జరిగితే ఏదైనా శాపం పెడ్తుంటారని మన పెద్దలు చెబుతుంటారు. గుడికి వెళ్లినపు వచ్చే పుణ్యం కంటే వారిద్దరికి కోపం తెప్పించి శాప గ్రస్తులు అవడం కంటే… శివ లింగానికి, నందీశ్వరుల మధ్య నడవ కూడదని చెప్తుంటారు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది