Devotional News : ఏ దేవుడికి ఏ నైవేద్యం సమర్పించాలి? పెట్టాక ఎప్పుడు తినాలో తెలుసా?
Devotional News : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో రకాల పూజలు, వ్రతాలు చేస్తుంటాం. అయితే పండుగ రోజులు.. ఏమైనా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తుంటా. అయితే చాలా మంది దేవుడిగి ప్రతిరోజూ దీపారాధన చేసినప్పటికీ… నైవేద్యం సమర్పించరు. అయితే అసలు ఏ దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే మంచిది.. దేవుడికి పెట్టిన ప్రసాదం మనం ఎప్పుడు తింటే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి వడపప్పు, పానకము నైవేద్యంగా సమర్పించాలి. అలాగే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి బెల్లం, ఉండ్రాళ్ళు, ఉండ్రాళ్ల పాయసం, జిల్లేడు కాయలంటే చాలా ఇష్టం. అయితే వినాయకుడికి ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకలను కానీ మాలను కానీ సమర్పించకూడదు. ఆంజనేయ స్వామికి అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి.
సమస్త జీవకోటికి ప్రాణాధారమైన సూర్య భగవానుడుకి మొలకెత్తిన పెసర్లు, పాల అన్నం నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అంతే కాకుండా లక్ష్మీ దేవికి క్షీరాన్నము, తీపి పండ్లతో నైవేద్యం సమర్పించాలి. శ్రీ కృష్ణ పరమాత్ముడికి అటుకులతో కూడా తీపి పదార్థాలు, వెన్నను నైవేద్యంగా సమర్పించాలి. పరమ శివుడికి కొబ్బరికాయ, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే.. స్వామి వారికి చాలా ఇష్టమట. ఈ విధంగా ఏ దేవుడికి ఇష్టమైన నైవేద్యం ఆ దేవుడికి సమర్పించి పూజ చేయటం వల్ల… వారు సంతృప్తి చెంది మనం కోరిన కోర్కెలు తీరేలా చేస్తారని మన పెద్దలు చెబుతున్నారు.అలాగే మనం దేవుడికి సమర్పించిన నైవేద్యాలను ఒక్కొక్కరు ఒక్కోసారి తింటుంటారు. చాలా మంది వెంటనే తింటే కొంత మంది ఉదయం పెడ్తే సాయంత్రం అలా తింటుంటారు.
అయితే మనం దేవుడికి సమర్పించిన నైవేద్యం ఎప్పుడు తినాలో తెలుసుకుందాం. మనం పూజ చేసే సమయంలో దేవుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. అయితే పూజ పూర్తయిన 5 నిమిషాల తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించడం శ్రేయస్కరమని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే మనం తినడమే కాకుండా ఇతరులకు పంచడం కూడా చాలా మంచిదట. అయితే దేవుడి ముందు ఎక్కువ సేపు ప్రసాదాన్ని ఉంచడం వల్ల దోమలు, చీమలు వంటివి చేరే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ సేపు అంటే ఐదారు గంటల పాటు అలాగే అస్సలే ఉంచకూడదని చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్ర వరకు అలాగే పెట్టడం వల్ల ప్రసాదం పాడయ్యే అవకాశమూ ఉంటుంది. అందుకే నైవేద్యం సమర్పించి… పూజ ముగిసిన 5 నిమిషాలకే ప్రసాదాన్ని తినాలి.