Born : ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు దేవతలు… ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే…!
Born : హిందూమతంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రం తో పాటు న్యూమరాలజీని కూడా చాలా దృఢంగా నమ్ముతారు. ఇక ఈ న్యూమరాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవితం పై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని నమ్మకం. ఈ నేపథ్యంలోనే చాలామంది రోజువారి జీవితంలో న్యూమరాలజీని పాటిస్తూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన అమ్మాయిలు అదృష్ట దేవతలుగా పరిగణించడం జరిగింది. ఇక ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు ఎక్కడ ఉన్న వారి చుట్టూ ఉన్న వారిని […]
ప్రధానాంశాలు:
Born : ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు దేవతలు...ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే...!
Born : హిందూమతంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రం తో పాటు న్యూమరాలజీని కూడా చాలా దృఢంగా నమ్ముతారు. ఇక ఈ న్యూమరాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవితం పై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని నమ్మకం. ఈ నేపథ్యంలోనే చాలామంది రోజువారి జీవితంలో న్యూమరాలజీని పాటిస్తూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన అమ్మాయిలు అదృష్ట దేవతలుగా పరిగణించడం జరిగింది. ఇక ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు ఎక్కడ ఉన్న వారి చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచుతారని న్యూమరాలజీ చెబుతుంది. మరి ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
న్యూమరాలజీ ప్రకారం 2 ,11 మరియు 20 తేదీలలో జన్మించిన అమ్మాయిలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారని , విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారని తెలుస్తోంది. దీనికోసం వీరు ఎంతగానో కష్టపడతారు. అంతేకాక ఈ తేదీలో జన్మించిన అమ్మాయిలు వారి భాగస్వామి విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా నడుచుకుంటారు. అందుకే న్యూమరాలజీలో 2 ,11 మరియు 20 తేదీలలో జన్మించిన అమ్మాయిలను మంచి భార్యలుగా పేర్కొనడం జరిగింది. అందుకే ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అబ్బాయిలు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అంతేకాక ఈ తేదీలలో పుట్టిన అమ్మాయి ఏ ఇంటికి అయితే కోడలుగా వెళుతుందో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంకా ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. ఈ తేదీలలో పుట్టిన అమ్మాయి రాకతో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుంది.
ఇక వీరి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. దీంతో వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు ఎవరిని బాధ పెట్టకుండా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాక వీరు ధనవంతులైనట్లయితే ఇతరులకు సహాయం చేయడానికి వెనకడుగు వేయరు. మానవతా దృక్పథంతో నడుచుకుంటారు. అంతేకాక ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా చాలా తెలివైన వారుగా ఉంటారు. అందుకే వీరిని ఎవరు మోసం చేయలేరు. ఇక వీరి యొక్క మంచి వ్యక్తిత్వాన్ని బట్టి వీరిని అందరూ ఇష్టపడతారు. అందుకే ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలని పెళ్లి చేసుకున్నవారు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు.