Born 4Am : తెల్లవారుజామున 4 గంటలకు పుట్టిన వారు అదృష్టవంతులా… దుదృష్టవంతులా… ?
ప్రధానాంశాలు:
Born 4Am : తెల్లవారుజామున 4 గంటలకు పుట్టిన వారు అదృష్టవంతులా... దుదృష్టవంతులా... ?
Born 4Am: జ్యోతిష్య శాస్త్రంలో జాతకాలను అంచనా వేయాలంటే పుట్టిన తేదీ, పుట్టిన ఘడియలు కూడా ఆ వ్యక్తి స్వభావాన్ని నిర్ణయిస్తాయి. ఇంకా ఆ వ్యక్తి విధి, భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పుట్టిన వారు అదృష్టవంతులుగా భావిస్తారు. నాలుగు గంటల సమయాన్ని అమృత ఘడియలు లేదా బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు. బ్రహ్మ ముహూర్తం తో సంబంధం కలిగి ఉండటం వల్ల అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఉదయం 4 గంటలకు జన్మించిన వ్యక్తుల స్వభావం, వృత్తి, ప్రేమ జీవితం ఎలా ఉంటాయని విషయాన్ని భోపాల్ కు చెందిన జ్యోతిష్యుడు, వాస్తు నిపుణుడు పండిట్ హితేంద్ర కుమార్ శర్మ వివరించారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటల సమయంలో జన్మించిన వారు, జీవితంలో విజయాలను సాధిస్తారని ప్రత్యేకంగా చెప్పబడింది.

Born 4Am : తెల్లవారుజామున 4 గంటలకు పుట్టిన వారు అదృష్టవంతులా… దుదృష్టవంతులా… ?
Born 4Am ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు పుట్టిన వారి స్వభావం
ఈ సమయంలో జన్మించిన వారు క్రమశిక్షణతో జీవిస్తారు. స్వతహాగా స్వావలంబన కలిగి ఉండడం వల్ల, తమ పనులు నిర్ణీత సమయానికి పూర్తిచేసే లక్షణం ఉంటుంది. మీరు ఏకాగ్రతతో పనిచేయడం వల్ల తమ లక్ష్యాలను చేరుకునే గుణం కూడా కనిపిస్తుంది. మీరు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఆశావాద దృష్టితో చూడగలరు. సింహం గుర్తుం లో జన్మించడం వల్ల ఆధ్యాత్మికతపై మక్కువ పెరుగుతుంది. మతపరమైన అంశాలపై ఆసక్తి కూడా కలిగి ఉంటారు. నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇస్తారు. పోతైన ఆలోచన చేసే స్వభావం వల్ల ఆత్మ పరిశీలనలో ఎక్కువ ఉంటారు. సహజంగా ప్రశాంతంగా కనిపించే వీరు ఏదైనా లక్ష్యం నిర్ణయించుకున్న వెంటనే పూర్తి అంకిత భావంతో పనిచేస్తారు.
Born 4Am లైఫ్ విజయ పరంపర
తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటల సమయంలో పుట్టిన వారి వారి జాతకం అద్భుతమైన ఊహాశక్తికి ఉంటుంది. సృజనాత్మకత ఎక్కువగా ఉండటం వల్ల రచన, కాళా, సంగీతం, మీడియా రంగాల్లో రాణించే అవకాశాలు అధికంగా ఉంటాయి. పరిపాలన నైపుణ్యాలు అధికంగా ఉండడంతో నాయకత్వ బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. రాజకీయాలు, చట్ట సంబంధిత రంగాలు. విద్య, సైన్స్, పరిశోధన వంటి రంగాల్లో విజయవంతమైన జీవితం కొనసాగించగలుగుతారు. నిబద్ధత, కృషి, అంకిత భావం ఉండటం వల్ల తమ రంగంలో అగ్రస్థాయికి చేరుకోగలుగుతారు.
ఈ వ్యక్తులు భావోద్వేగపరంగా లోతైన ఆలోచనలు చేసే స్వభావం కూడా కలిగి ఉంటారు. సంబంధాలను నమ్మకంగా కొనసాగించే గుణం కూడా ఉంటుంది. తమ భావాలను ప్రత్యక్షంగా వ్యక్తపరచడం తక్కువే అయినా, ఎవరితోనైనా సంబంధాన్ని ఏర్పరచుకున్న వెంటనే నిజాయితీగా, విధేయతతో కొనసాగిస్తారు. కొంత మర్మంగా ఉండే స్వభావం వల్ల వారిని పూర్తిగా అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టతరంగా మారుతుంది. వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. తమలో తాము మునిగిపోవటం అలవాటు. అయితే, మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా అంగీకరించిన, బలంగా నమ్మిన ఆ బంధం చాలా బలమైనదిగా మారుతుంది.