అమ్మవారికి పెట్టిన బట్టలు అందరూ కట్టుకోవద్దు.. నియమాలివే!
పురాణాల ప్రకారం మనకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారు. అందులో సగం దేవతలు కూడా ఉన్నారనే మనందరికీ తెలిసిందే. అయితే వారి కోసం మన దేశంలో ఎన్నెన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. అమ్మవార్లకు అంటే ఆడ దేవతలకు మనం ప్రత్యేక పూజలు చేయడం, వ్రతాలు అలాగే ఒడిబియ్యం పోయడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే చాలా మంది భక్తులు అమ్మవార్లకు పట్టు బట్టలు… నిరు పేదలు అయితే చిన్న జాకెట్టు ముక్కను అయినా పెడుతుంటారు. అయితే అలా బట్టలు పెట్టిన వాళ్లు లేదా ఒడిబియ్యం పోసినప్పుడు పెట్టిన బట్టలను అమ్మవారికే ఇచ్చేస్తుంటారు కొంత మంది. మరి కొంత మందేమో… వారే తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్న వాళ్లలో కొందరు ఆ బట్టలు కట్టుకోకూడదని చెబుతుంటారు.
మరి అలా ఎందుకు చెబుతుంటారు? మరి అమ్మ వారికి పెట్టిన బట్టలను ఎవరు కట్టుకోవాలి? ఏయే సమయాల్లో కట్టుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.అమ్మ వారికి సమర్పించిన బట్టలను భక్తులు ధరించవచ్చని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కాని.. పిల్లలు పుట్టే వాళ్లు అమ్మవారి చీరను ధరించకూడదని చెబుతుంటారు. అలాగే అమ్మ వార చీరను కట్టుకున్న ఇష్టానుసారంగా మెలగకూడదంట. అలాగే నెలసరి సమయాల్లో కూడా చీరను ధరించకూడదంట. ఎంతో పవిత్రమైన అమ్మవారి చీరలను ధరించినప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతే కాదండోయ్ మొదటి సారి మహిళలు అమ్మవారి చీరను ధరిస్తున్నట్లయితే.. మంచి ముహూర్తం చూసుకొని కట్టుకోవాలి.

who can tie the clothes pu on the ammavaru
పూజలు, ప్రత్యేక వ్రతాలప్పుడు ధరిస్తే మరింత మంచిది. అలాగే అమ్మవారి చీరను ధరించి నీచు తినకూడదని, మద్యం సేవించ కూడదని చెబుతున్నారు. అమ్మవారి చీరను ధరించినపుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంట. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దని, తిట్టకూడదని కూడా చెబుతున్నారు. అలాగే ఈ చీరను ధరించినప్పుడు పడక గదిలోకి వెళ్లకూడదంట, అలాగే భర్తతో సన్నహితంగా ఉండకూడదంట. ఇలాంటి నియమాలు పాటించినప్పుడే అమ్మవారి కటాక్షం మనపై ఉంటుందట. అయితే ప్రసిద్ధ ఆలయాల్లో తీసుకున్న చీరలయినా.. దేవీ నవరాత్రులు, గ్రామాల్లో తీసుకున్న చీరలు కూడా అవే ఫలితాలను ఇస్తాయంట. అందుకే అమ్మవారి చీరను దక్కించుకునేందుకు ప్రజలు తెగ ఉవ్విళ్లూరుతుంటారు. ఆ చీరను ధరించడం వల్ల ఆ ఇంటికి ఎంతో మంచి జరుగుతుందట.