Temple : గుడిలోకి ప్రవేశించే ముందు కాళ్లు, చేతులు ఎందుకు కడుక్కోవాలి?
మనకు ముక్కోటి దేవతలు ఉన్నాయి. మనకు ఎలాంటి పండుగలు, పబ్బాలుస శుభ కార్యాలు, ఆనందం, బాధ వచ్చినా గుడికి వెళ్తుంటాం. మన బాధలు, సంతోషాలు ఆ దేవుడితో చెప్పుకొని కాస్త మనశ్శాంతిని పొందుతుంటాం. అయితే మనం గుడికి వెళ్లే ముందు తలంటు స్నానం చేసి, నీచు తినకుండా ఎంతో నిష్టగా వెళ్తాం. తలంటు స్నానం చేయకుండా అస్సలే వెళ్లం. అందులోనూ స్నానం చేశాక ఏమైనా తింటే మళ్లీ స్నానం చేసి వెళ్తుంటాం. అలాంటిది మళ్లీ అక్కడికి వెళ్లాకా… అంటే గుడికి వెళ్లాక కాళ్లు, చేతులు కడక్కుంటాం. ఇంటి దగ్గరే శుభ్రంగా స్నానం చేసి వెళ్లినప్పటికీ మనం మళ్లీ గుడి దగ్గర ఎందుకు కాళ్లు చేతులు కడుక్కోవాలి. అ
సలు అలా కడుక్కొని వెళ్తేనే దేవుడు మన కోరికల్ని, బాధల్ని వింటాడా. కాళ్లు, చేతులు కడుక్కోకుండా ఆలయంలోకి వెళ్తే ఎమవుతుంది అనే అనుమానాలు చాలా మందికి వస్తుంటాయి. అయితే అసలు గుడిలోకి ప్రవేశించే ముందు కాళ్లు, చేతులు ఎందుకు కడుక్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మనం ఇంటి దగ్గర ఎంత శుభ్రంగా స్నానం చేసి.. ఉతికిన బట్టలు మాత్రమే ధరించి వెళ్లినవ్పటికి… కాళ్లకు చెప్పులు వేసుకుంటాం. కాబట్టి ముందుగా గుడి ముందు చెప్పులను విడిచి ఆలయం దగ్గర లేదా గుడి ప్రాంగణంలో ఉన్న పంపు వద్ద లేదా బావి వద్ద మళ్లీ కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పంచ భూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి… పంచ భూతాలకి అధిపతి అయిన నీ దగ్గరకు వస్తున్నామని
మననం చేసుకుంటూ… ఏపాదమస్తకమూ శుభ్రం చేసుకోవాలి. ముందుగా రెండు కాళ్ల వెనుక భాగాన్ని ముందుకు తడిచేలా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత చేతులను శుభ్ర పరుచుకోవాలి. నోట్లో నీళ్లు పోసుకొని మూడు సార్లు పుక్కిలించి ఉమ్మాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లను తీస్కొని తలపై చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం పరిపూర్ణ శుభ్రంగా మారుతాం.దేవా శరీరరీం, మాక్కుకి మూల కారకమైన నాలుకా, నోరూ, కూడా శుభ్రం చేసుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాను. కాబట్టి మమ్మల్ని దీవించు అని అర్థం. అందుకే గుడికి వెళ్లే వాళ్లు తప్పని సరిగా కాళ్లు, చేతులు, నోరు కడుక్కున్నాకే గుడిలోకి వెళ్లి ఆ భగవంతుడి కృపకు పాత్రులు కావాలి.