Diwali : దీపావళి రోజు శనీశ్వరుని పూజిస్తే అన్ని దరిద్రాలు పోయి కోటీశ్వరులవడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diwali : దీపావళి రోజు శనీశ్వరుని పూజిస్తే అన్ని దరిద్రాలు పోయి కోటీశ్వరులవడం ఖాయం…!

Diwali : దీపావళి పండగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకు దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం. ఆ రోజున బాణాసంచా కాల్చవచ్చని మరియు కమ్మనైన పిండి వంటలు తినవచ్చని అనుకుంటారు. అలాగే ఆ రోజున లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో సంపద పెరగడంతో పాటు జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు శనీశ్వరుని పూజించడం వలన […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 October 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Diwali : దీపావళి రోజు శనీశ్వరుని పూజిస్తే అన్ని దరిద్రాలు పోయి కోటీశ్వరులవడం ఖాయం...!

Diwali : దీపావళి పండగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకు దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం. ఆ రోజున బాణాసంచా కాల్చవచ్చని మరియు కమ్మనైన పిండి వంటలు తినవచ్చని అనుకుంటారు. అలాగే ఆ రోజున లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో సంపద పెరగడంతో పాటు జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు శనీశ్వరుని పూజించడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కొంతమందికి శని దేవుడు అంటే భయం. ఏలినాటి శని ఉంటే ఏడు సంవత్సరాల వరకు పోదు అని అంటారు. అలాగే ఎవరైనా తప్పులు చేస్తే శని శిక్షిస్తాడు. అష్టమ శని సడే సాతి అనేవి వింటూనే ఉంటాం. శని వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు.

Diwali దీపావళి రోజు శనికి ప్రత్యేకమైన పూజలు

శనీశ్వరుడు కరుణిస్తే కటిక పేదవాడైన ధనవంతుడిగా మారిపోతాడు. అదేవిధంగా ఎంత పెద్ద రాజు అయిన బీదవాడిగా మారిపోతాడు. కాబట్టి మంచి పనులు చేస్తూ శనిశ్వరుడి అనుగ్రహం పొందాలని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవితో పాటు శనీశ్వరుని కూడా పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Diwali అమావాస్య అంటే ఇష్టం

అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే అమావాస్య అంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టం. కాబట్టి దీపావళి పండుగ రోజున శనీశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆ రోజున ఆవులు కాకులు కుక్కలు తినడానికి ఏమైనా ఆహార పదార్థాలను పెట్టడం వలన శని అనుగ్రహాన్ని పొందవచ్చు.

Diwali తైలాభిషేకం

దీపావళి పండుగ రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపిస్తే శని అనుగ్రహం లభిస్తుంది. అయితే పురాణాల ప్రకారం దీపావళి పండుగ రోజున హనుమంతుడిని మరియు వెంకటేశ్వర స్వామిని పూజించిన శని అనుగ్రహం లభిస్తుంది.

Diwali దీపావళి రోజు శనీశ్వరుని పూజిస్తే అన్ని దరిద్రాలు పోయి కోటీశ్వరులవడం ఖాయం

Diwali : దీపావళి రోజు శనీశ్వరుని పూజిస్తే అన్ని దరిద్రాలు పోయి కోటీశ్వరులవడం ఖాయం…!

పండగ రోజు ఇలా చేయండి : దీపావళి పండుగ రోజున నల్ల చీమలకు ఆహారంగా బెల్లం లేదా పంచదారను వెయ్యండి. అదేవిధంగా దీపావళి రోజున ఒక గిన్నెలో నూనె పోసి అందులో వారి మొఖం చూసుకుంటే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ తరువాత కాళ్లు చేతులు కడుక్కొని వెనకకి తిరిగి చూడకుండా వారి ఇంటికి వెళ్లి పోవాలి. ఇలా చేయడం వలన అపారమైన ధనం తో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది