Yamadharma Raja : చనిపోయిన వ్యక్తులు నరకానికి ఎలా వెళతారో తెలుసా… ఇది తెలిస్తే భయంతో వణికిపోతారు…?
Yamadharma Raja : జనన మరణములు తథ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరణం ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కొందరు అనారోగ్య సమస్యలతో చనిపోతే, మరికొందరు వయసు పైబడిన తరువాత చనిపోతారు. మరికొందరు అకస్మాత్తుగా యాక్సిడెంట్లుగా చనిపోతారు. మరికొందరు సూసైడ్ చేసుకొని మరీ చనిపోతుంటారు. చనిపోయిన ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది ఎక్కడికి వెళుతుంది అనేది మాత్రం ఎన్నో కథలు ప్రాచుర్యాలలో చెప్పబడుతున్నాయి. గరుడ పురాణంలో కూడా జనన మరణాల గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే, ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం చనిపోయిన ఆత్మ ప్రయాణం,యమధర్మరాజు వద్దకు ఎలా చేరుతుందో తెలుసుకుందాం…

Yamadharma Raja : చనిపోయిన వ్యక్తులు నరకానికి ఎలా వెళతారో తెలుసా… ఇది తెలిస్తే భయంతో వణికిపోతారు…?
చనిపోయిన వ్యక్తి ఆత్మ , ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తుంది అనే విషయం ఇప్పటికీ ఎవరి కూడా తెలియని సీక్రెట్. ఇప్పటికీ చాలామంది కూడా కథలుగా చెబుతూ ఉంటారు. కొంతమంది కోరికలు తీరక భూమిపైనే ఆత్మలుగా తిరుగుతూ ఉంటారని చెబుతుంటారు. తన కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతూ ఉంటారని,మరికొందరు ఏమో ఆత్మ తన అంత్యక్రియల నుంచి కర్మకాండలు పూర్తయ్యే వరకు భూమిపైనే ఉంటుందని చెబుతూ ఉంటారు. దీని గురించి సరైన సమాధానం తెలియడం లేదు. గరుడ పురాణం మాత్రం చాలా వివరంగా తెలియజేస్తుంది. ఏ వ్యక్తి అయితే చనిపోతాడు ఆ వ్యక్తి ముందే వారికి సృష్టి మొత్తం కనిపిస్తుందట. కానీ చనిపోయే ముందు మాట పడిపోవడం కళ్ళతో అన్ని చూడడం చేస్తారట. కానీ ఏది చెప్పడానికి వీలు లేకుండా కదలిక లేక ఉండిపోతారు.మాటలు కూడా నోటి నుంచి పెగలవు.
ఇలాంటి సంఘటన కొద్ది క్షణాలలో ప్రాణం విడుస్తారు అనే సమయానికి ఇద్దరు యమదూతలు కనిపిస్తారట. కానీ ఆ కనిపించిన విషయం ఎవరికీ చెప్పకుండా ఉండుట కొరకు వారి నోటి మాట పడిపోతుందట, కదల్లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారట. వారిని యమకింకరులు అని కూడా అంటారు. అంటే యమ బటులు. వీరు చూడడానికి పెద్ద పెద్ద గోర్లతోటి నల్లగానూ, సరిగ్గా లేని తల శరీరాకృతి చాలా భయంకరంగా ఉంటుందట. మరణించిన వ్యక్తులు వారిని చూసి భయపడిపోతారట. ఎంతమంది ఈ యమ బటులు కనపడగానే చనిపోయే ముందు వారిని చూసి భయపడి చాలా బిగరగా అరవడం, ఇంకా మల,మూత్ర విసర్జనలు చేయటం కూడా చేస్తూ ఉంటారట.
Yamadharma Raja చనిపోయిన వ్యక్తులు యమధర్మరాజు వద్దకు ఎలా చేరుకుంటారు
చనిపోయిన వ్యక్తులు ఆత్మలను యమదూతలు యమధర్మరాజు వద్దకు తీసుకెళ్లడానికి కనీసం 47 రోజుల సమయం పడుతుందట. ఈ సమయంలో ఆత్మను తీసుకెళ్లే క్రమంలో యమదూతలును చాలా ఇబ్బందులు పెడతారట. దీంతో వారి ఆత్మను కొట్టడం,బెదిరించడం లాంటివి కూడా చేస్తుంటారట. అయితే,ఆత్మకు నరకంలో జరిగే శిక్షణ గురించి కూడా చెబుతూ తీసుకెళ్తారట. దీంతో ఆత్మలు చాలా ఏడుస్తూ నన్ను తీసుకెళ్లవద్దు అంటూ ప్రాధేయపడుతూ ఉంటాయట. భూలోకంలో తప్పులు చేసినవారికి జైల్లో ఏలాంటి శిక్షలు విధిస్తారో మందిరికి తెలుసు. యమలోకంలో విధించే శిక్షల గురించి తెలిస్తే మాత్రం భయంతో వణికి పోవాల్సిందే. అక్కడ వ్యక్తి చేసిన పాప పుణ్యాల ఆధారంగా యమధర్మరాజు ఆత్మలకు శిక్షలను విధిస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఆత్మ మరోసారి భూలోకానికి చేరుతుందట. ఎందుకంటే తాను చేసిన పాపపుణ్యాలు లెక్కించడానికి, ఆత్మను తమ బంధువుల వద్దకు పంపిస్తుందట.ఆ లోపు కుటుంబ సభ్యులు అంత్యక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుందట. లేదంటే యమలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఆత్మ అక్కడే ఉంటుందట.