Yamadharmaraju : చావు మనల్ని వెంటాడుతుందని యమధర్మరాజు పంపే ఈ సంకేతాలతో తెలుస్తుందట..?
Yamadharmaraju : మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉన్న అంతరమే జీవితం.దీని కోసం చాలా మంది బతికినంత కాలం భయపడుతూనే బతుకుతుంటారు. తీరా మరణం దగ్గర పడిన సమయంలో జీవితంలో ఏం సాధించానని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో టెన్షన్స్, భయమే ఉంటాయి. అయితే, మనిషి మరణం దగ్గర పడే సమయంలో యమధర్మరాజు ముందునే నాలుగు సంకేతాలను పంపిస్తాడట.. అవేంటే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Yamadharmaraju : ఎలా గుర్తించాలి మరణ సంకేతాలను..
మనిషి పుట్టుక చావు గురించి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా వివరిస్తాడు. మనిషి పుట్టడం, మరణం అనివార్యం అని.. ఇదే సృష్టిధర్మం అని చెబుతాడు. మనిషికి మరణం ఉంటుందని, ఆత్మకు ఉండదని కూడా గీతలో వాసుదేవుడు చెప్పుకొచ్చాడు. ఆత్మ శరీరాన్ని వదిలేసిన అనంతరం మరొక కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుందని సృష్టి రహస్యం తెలిపాడు.అందుకే భగవద్గీత చాలా మంది విశ్వసిస్తుంటారు. మరణం సమీపించినప్పుడు తెలిపే సంకేతాలను యమధర్మరాజు యమునా నదీ తీరంలో ఉండే అమృతుడికి చెప్పాడట..ఎందుకంటే అతనికి ఎపుడు చనిపోతానేమో అని భయపడేవాడట.. ఈ దిగులు పోగొట్టుకోవడం కోసం యమ ధర్మరాజు ప్రసన్నం కోసం చాలా కాలం తపస్సు చేశాడట..
ఓ రోజు యముడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడట. దీంతో నాకు మరణం ఎప్పుడు వస్తుందో ముందే చెప్పాలని కోరాడట.. కాగా, మరణం ఎప్పుడు వస్తుందో ముందే చెప్పలేనని అందుకు గుర్తుగా కొన్ని సంకేతాలను పంపిస్తానని చెప్పాడట.. వాటిని బట్టి గుర్తుపట్టాలని సూచించాడట.. ఆ తర్వాత అమృతుడు పెళ్లిచేసుకుని హాయిగా జీవించాడు.కొంతకాలాన్ని అమృతుడి మరణం దగ్గర పడగాయమధర్మరాజు వచ్చి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో నాకు ఇచ్చిన వరం ఏమైందని అమృతుడు అడగ్గా.. చర్మం ముడతలు పడటం, వెంట్రుకలు తెల్లబడటం. పళ్ళు ఊడిపోవడం, పక్షవాతం లేదా వృద్ద్యాప్యంతో మంచానికే పరిమితం కావడం ఇవన్నీ సంకేతాలని చెప్పాడట..