Zodiac Signs : శని వక్ర సంచారంతో నక్క తోక తొక్కిన రాశులు వారు వీరే…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : శని వక్ర సంచారంతో నక్క తోక తొక్కిన రాశులు వారు వీరే...!
Zodiac Signs : శని దేవుడిని న్యాయదేవతగా భావిస్తారు. అలాగే కలియుగానికి Zodiac Signs న్యాయ నిర్ణేతగా కూడా చెబుతారు. అయితే శని దేవుడు వారి కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తాడు. ఇలా శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశి మార్చుకొని సంచరిస్తాడు. అయితే 2025 మార్చి నెలలో శనిగ్రహం మీనరాశి లోకి ప్రవేశించబోతుంది. దీని కారణంగా శని జూలై నెలలో తిరోగమనంలో ఉంటాడు. ఇలా మీన రాశిలో శని తిరోగమనం చెందడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Zodiac Signs వృషభ రాశి
శని వక్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి ప్రత్యేకమైన ప్రభావాలు కలుగుతాయి. ఈ రాశి వారు చేసే పనులలో పురోగతి ఉంటుంది. ఇక గతంలో నిలిచిపోయిన పనులన్నీ సకాలం లో పూర్తవుతాయి. ఉద్యోగులకు ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇక వృషభ రాశి జాతకుల భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.
మిధున రాశి : మిధున రాశి వారికి శని సంచారం కారణంగా శుభప్రదంగా ఉండబోతుంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి పై శని అనుగ్రహం ఉండడంతో వీరికి అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగులకు మంచి పురోగతి ఉంటుంది. అయితే ప్రతి శనివారం రోజు దేవుడికి పూజ చేసి దీపం వెలిగించాలి. అదేవిధంగా కొన్ని మంత్రాలను పఠించదం వలన జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా బలపడతారు.
కుంభరాశి : కుంభ రాశి వారికి శని వక్ర సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి ఆదాయం రెట్టింపు అవుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. నూతన ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.