Home » Andhra Pradesh » Icds Organised Collective Seemantham For Pregnant Women
andhra pradesh

Eastgodavari.. పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా సామూహిక సీమంతం

Authored By
praveen T
The Telugu News | Updated on: September 21, 2021 1:12 pm
Advertisement

జిల్లాలోని గొల్లప్రోలులో పౌష్టికాహార మహోత్సవంలో భాగంగా గొల్లప్రోలు పరిధిలోని సాయిబాబా కల్యాణమండపంలో సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు హాజరయ్యారు. ఐసీడీఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అంగన్ వాడీ టీచర్లు, వైసీపీ నాయకులు హాజరైన ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు పెండెం దొరబాబు మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచన మేరకు ఆహారపదార్థాలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యం విషయమై సందేహాలను అంగన్ వాడీ టీచర్లు, వైద్య శాఖ సిబ్బందితో పాటు వైద్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో గర్భిణులకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు పెట్టారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా ఈ సామగ్రిని గర్భిణులకు అందజేసి, సీమంత కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు పరిధిలోని గర్భిణులు పాల్గొన్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి