Eastgodavari.. పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా సామూహిక సీమంతం

Authored By praveen T | The Telugu News | Published on: September 21, 2021, 1:12 pm

జిల్లాలోని గొల్లప్రోలులో పౌష్టికాహార మహోత్సవంలో భాగంగా గొల్లప్రోలు పరిధిలోని సాయిబాబా కల్యాణమండపంలో సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు హాజరయ్యారు. ఐసీడీఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అంగన్ వాడీ టీచర్లు, వైసీపీ నాయకులు హాజరైన ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు పెండెం దొరబాబు మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచన మేరకు ఆహారపదార్థాలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యం విషయమై సందేహాలను అంగన్ వాడీ టీచర్లు, వైద్య శాఖ సిబ్బందితో పాటు వైద్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గర్భిణులకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు పెట్టారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా ఈ సామగ్రిని గర్భిణులకు అందజేసి, సీమంత కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు పరిధిలోని గర్భిణులు పాల్గొన్నారు.

 

praveen T

No bio available for this author.

  1. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  2. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  3. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  4. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  5. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  6. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  7. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp