14 Days Remand Allu Arjun : అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్.. బెయిల్ నిరాకరించిన కోర్ట్..!
ప్రధానాంశాలు:
14 Days Remand Allu Arjun : అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్.. బెయిల్ నిరాకరించిన కోర్ట్..!
14 Days Remand Allu Arjun : పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ కి నాంపల్లి హై కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో రేవతి అనే మహిళ తొక్కిసలాటల్లో మృతిచెందింది. అయితే సరైన ముదస్తు ప్రణాళిక సెక్యురిటీ లేకుండా అల్లు అర్జున్ అక్కడకి వచ్చాడని తెలుస్తుంది. ఐతే సంధ్య థియేటర్ లో బందోబస్తుకి పోలీసుల పర్మిషన్ తీసుకున్నా ఆ ప్రీమియర్ షోకి పర్మిషన్ లేనందున పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు వెళ్లి అతన్ని ఉన్నపళంగా కస్టడీలో తీసుకున్నారు. ముందు చిక్కడపల్లి స్టేషన్ లో రిపోర్ట్ తీసుకుని ఆ తర్వాత గాంధి హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేసి ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఐతే అంతకుముందే క్వాష్ పిటీషన్ వేసినా కూడా ఆల్రెడీ రిపోర్ట్ తీసుకోవడం వల్ల కోర్టు విచారణ జరిపింది.
14 Days Remand Allu Arjun అల్లు అర్జున్ ప్రమేయం ఏమి లేదని.. కేసు విత్ డ్రా చేసుకుంటానని
ఐతే సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటనలకు అల్లు అర్జున్ కూడా ఒక కారణమని భావిస్తూ కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ఐతే దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భిన్నరకాలుగా వాదనలు వినిపిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె భర్త ఈ కేసు వేశాడు. ఐతే అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం అతనుకూడా కేసు విత్ డ్రా చేసుకుంటానని చెప్పాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం ఏమి లేదని ఆయన అన్నారు.
పోలీసులు ఒక పథకం ప్రకారమే అల్లు అర్జున్ ని ఈరోజు మధ్యాహ్నం కస్టడీలో తీసుకుని ఆ తర్వాత విచారణ జరిపి అనంతరం కోర్ట్ లో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్ అంతా ఈ విషయంపై వాడివేడిగా ఉన్నారు. 14 Days Remand for Allu Arjun Pushpa 2 Premiers ,