Allu Arjun Arrest Live Updates : అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun Arrest Live Updates : అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

 Authored By ramu | The Telugu News | Updated on :13 December 2024,3:49 pm

Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్ తో ఒక్కసారిగా షాక్ అయిన టాలీవుడ్. అల్లు అర్జున్ ని కట్టుబట్టలతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. డ్రస్ మార్చుకుంటానన్న నో అని చెప్పారని తెలుస్తుంది. అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి.. ఆ తర్వాత గాంధి హాస్పిటల్ కు వైద్య పరీక్షలు చేయించేందుకు తీసుకెళ్లారు.. అల్లు అర్జున్ అరెస్ట్ అని తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.

Allu Arjun Arrest Live Updates అల్లు అర్జున్ కు బెయిలా జైలా

Allu Arjun Arrest Live Updates : అల్లు అర్జున్ కు బెయిలా… జైలా…?

అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అరవింద్, అల్లు శిరీష్ వెళ్లారు.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు నిర్మాతలు దిల్ రాజు, నాగ వంశీ వచ్చారు.

అల్లు అర్జున్ కోసం చిరంజీవి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వస్తారన్న విషయం తెలియగా.. పోలీసులు చిరంజీవిని పోలీస్ స్టేషన్ కు రావొద్దని పరిస్థితి అదుపు తప్పుతుందనే కారణం చేత చిరంజీవిని రావొద్దని అన్నారని తెలుస్తుంది.

అల్లు అర్జున్ ని గాంధిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత పోలీసు కారులోనే నాంపల్లి కోర్ట్ కు తీసుకెళ్లారు.

అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటీషన్ ను ఈ సాయంత్రం 4 గంటలకు విచారణ నిర్వహించనున్నారు. సోమవారం వరకు ఈ విచారణ వాయిదా వేయాలని కోరగా.. ఒకవేళ అల్లు అర్జున్ రిమాండ్ కు తరలించాల్సి వస్తే మాత్రం 14 రోజులు చంచల్ గూడ జైలులో ఉండాల్సి వస్తుంది.

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయి’’ అని పేర్కొన్నారు.

నాంప‌ల్లి కోర్టులో కేసు వివ‌రాలు జ‌డ్డికి వివ‌రిస్తున్నా పోలీసులు

కోర్ట్ తీర్పుపై సర్వత్రా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ని రిమాండ్ కి తరలిస్తారా లేదా అన్నది చూడాలి. Allu Arjun, Pushpa 2, Allu Arjun Arrest

అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సేఫ్టీ ప్రోటోకాల్ అనే విషయంలో విఫలమైతే హీరోపై వెయ్యడం సరికాదు.

చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు హీరో అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షలు పూర్తయిన సందర్భంగా ఆయనను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉండనున్నాయి. ఈక్రమంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసులు బందోబస్తును చేపట్టారు.

నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అరవింద్, త్రివిక్రమ్.

బట్టలు మార్చకోవడానికి సమయం ఇవ్వకుండా బెడ్ రూమ్ నుంచి నేరుగా అరెస్టు చేసి తీసికెళ్లడం తప్పు. ఒక జాతీయ అవార్డు గ్రహితను, ప్రముఖ హీరో పట్ల ఈ రకంగా అమర్యాదగా వ్యవహరించి అవమానించి అగౌరవపరిచిన తీరు ఎంత మాత్రం సమర్థనీయం కాదు. నటనతో భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఓ నటుడు పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించి ఉండాల్సింది కాదు.

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని కోరుతున్న న్యాయవాదులు .

అల్లు అర్జున్ పై నమోదైన కేసులో కీలక మలుపు సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపిన రేవతి భర్త భాస్కర్. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని కోరాడు. తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు.

అల్లు అర్జున్ కు రిమాండ్ 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు కాసేపట్లో చంచల్ గూడ జైలుకు తరలించనున్న పోలీసులు

No liveblog updates yet.

LIVE UPDATES

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది