Box Office 2026 : టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో సువర్ణ అధ్యాయం .. 10 రోజులు, 5 సినిమాలు, 800 కోట్లు..!
ప్రధానాంశాలు:
Box Office 2026 : టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో సువర్ణ అధ్యాయం .. 10 రోజులు, 5 సినిమాలు, 800 కోట్లు
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం పది రోజుల వ్యవధిలో, అంటే జనవరి 9 నుంచి జనవరి 19 వరకు, థియేటర్లలో విడుదలైన ఐదు భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దాదాపు రూ. 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషంగా మారింది. ఈ ఘన విజయం టాలీవుడ్ మార్కెట్ బలం, ప్రేక్షకుల ఆదరణ ఎంత స్థాయిలో ఉందో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.సంక్రాంతి పండుగకు అనుగుణంగా కుటుంబ ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలిరావడంతో పాటు, స్టార్ హీరోల సినిమాలపై ఉన్న అంచనాలు కూడా ఈ సీజన్‌ను ప్రత్యేకంగా నిలిపాయి.
Box Office 2026 : టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో సువర్ణ అధ్యాయం .. 10 రోజులు, 5 సినిమాలు, 800 కోట్లు..!
Box Office 2026 : వసూళ్ల సునామి..
పండుగ వాతావరణం, సెలవులు, గ్రామీణ–పట్టణ ప్రేక్షకుల సమాన ఆసక్తి కలిసి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లకు దారితీశాయి. ముఖ్యంగా తొలి వారంలోనే సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఐదు చిత్రాల్లో కొన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోగా, మరికొన్ని యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో యువతను థియేటర్లకు లాగాయి. స్టార్ పవర్, బలమైన కథలు, పండుగకు సరిపోయే వినోదం కలిసి సంక్రాంతి సీజన్‌ను బ్లాక్‌బస్టర్‌గా మార్చాయి. ముఖ్యంగా కొన్ని సినిమాలు వంద కోట్ల క్లబ్‌ను వేగంగా చేరుకోవడం, మరికొన్ని అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి వసూళ్లు రాబట్టడం టాలీవుడ్ గ్లోబల్ రేంజ్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.
ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ఈ సంక్రాంతి సీజన్ విజయానికి ప్రధాన కారణం కంటెంట్ వైవిధ్యం. ఒకే తరహా సినిమాలు కాకుండా, విభిన్న శైలుల్లో వచ్చిన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తిపరిచాయి. అలాగే, థియేట్రికల్ అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందిన సినిమాలు ప్రేక్షకులను ఓటీటీకి కాకుండా మళ్లీ పెద్ద తెర వైపు మళ్లించాయి. సంక్రాంతికి వచ్చిన సినిమాలలో మన శంకర వరప్రసాద్ గారు రూ.300 కోట్లు, రాజా సాబ్ రూ.238 కోట్లు రాబట్టాయి. ఇక భర్త మహాశయులకి విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి చిత్రాలు బ్రేక్ ఈవెన్ సాధించాయి. నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగ ఒక రాజు చిత్రం 102 కోట్లు రాబట్టింది. మొత్తంగా 5 చిత్రాలు 800 కోట్ల రూపాయల వసూలు రాబట్టినట్టు సమాచారం