SR NTR : సీనియర్ ఎన్టీఆర్ వ‌ల‌న ఆ హీరోయిన్ డ్యూయెట్ సాంగ్స్ కి దూర‌మైందా?

SR NTR : తెలుగు సినిమా ప్ర‌స్తావ‌న వ‌స్తే అందులో ఎన్టీఆర్ పేరు త‌ప్ప‌క ఉంటుంది. ఓ వైపు పౌరాణిక చిత్రాల్లో న‌టిస్తూ వెండితెర దేవుడిగా వెలుగొందినా.. మ‌రోవైపు మాస్ సినిమాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లుగించినా అది ఒక్క ఎన్టీఆర్‌కే ద‌క్కింది కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం కాకుండా.. రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేశారు నంద‌మూరి తార‌కరామ‌రావు. తెలుగు ప్ర‌జ‌లు ఉన్న‌న్ని రోజులు ఎన్టీఆర్ అనే పేరు వినిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లి 25 ఏళ్లు గ‌డుస్తోన్నా ఇప్ప‌టికీ ఆయ‌న‌ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అయితే ఆయ‌న వ‌ల‌న ఓ హీరోయిన్ డ్యూయెట్ సాంగ్‌కి దూరం కావ‌ల‌సి వ‌చ్చింద‌ట‌. వెండ‌తెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన ఎన్టీఆర్ మొత్తం 302 సినిమాల్లో న‌టించారు. వీటిలో ఏకంగా 275 సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజయం సాధించాయి. సినిమా ఇండస్ట్రీలో ఆయన నటనకు ప్రత్యేకమైన గుర్తింపు లభించడమే కాకుండా, సినీ ఇండస్ట్రీ ని తారస్థాయికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ తెలుగు లోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళం ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇప్పటికే అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో ఒక రాముడు, కృష్ణుడిగా నిలిచిపోయారు. అయితే ఎన్టీఆర్ సినిమాలు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదట. ఆయన సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి యూనిట్ అంతా కలిసి పండగ చేసుకునే వారట.. అయితే ఓ షూటింగ్ స‌మ‌యంలో తన అందచందాలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న వాణిశ్రీ సీనియర్ ఎన్టీఆర్ వల్ల డ్యూయట్స్ కి దూరం అయిందట. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. సీనియర్ ఎన్టీఆర్ వాణిశ్రీ కలిసి చాలా సినిమాల్లో నటించారు.. ఇందులో బంపర్ హిట్ కొట్టిన మూవీ ఎదురులేని మనిషి. ఈ సినిమాని అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేయగా .. వాణిశ్రీ తన నటనతో అదరగొట్టింది. కానీ మూవీలో ఒక పాటను షూటింగ్ చేస్తుండగా వాణిశ్రీ చాలా ఇబ్బంది పడిందని, కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఆమెకు నచ్చలేదని, దీంతో ఈ విషయాన్ని ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్ళిందట.

A heorine left doing duet songs because of Sr NTR

ఈ విషయంలో సాయం చేయాలని ఎన్టీఆర్ ని వాణిశ్రీ కోరింది. అయితే ఎన్టీఆర్ మాత్రం తాను ఏమీ చెప్పలేనని, వాళ్లు డబ్బులు పెట్టి సినిమా తీస్తారు కాబట్టి వారు చెప్పినట్లే చేయాలని అదే ట్రెండ్ నడుస్తోందని అన్నారట. దీంతో వాణిశ్రీ ఏం చేయలేక ఇబ్బందితో ఆ చిత్రంలోని పాటలను పూర్తి చేసిందని తెలుస్తోంది . దీని తర్వాత తాను చేసే ఏ సినిమాలో అయినా డ్యూయట్ సాంగ్స్ చేయబోనని ముందే చెప్పిందట వాణి శ్రీ.ఆ విధంగా ముందు కండీషన్ పెట్టిన తర్వాతే సినిమా ఒప్పుకునేదని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ మాత్రం పరోక్షంగా కారణమయ్యారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న సెట్‌లో ఉంటే ఎంత సంద‌డిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చివరి రోజు షూటింగ్ పూర్తి కాగానే అన్న గారితో కలిసి హీరో హీరోయిన్ లను ప్రత్యేకంగా పిలిపించుకుని పండుగ చేసుకునే వారట.

ఆ సమయంలో ఏ సినిమా అయినా షూటింగ్ పూర్తయ్యే సమయానికి అందరినీ పిలిచి విందు ఇవ్వడం జెమిని, వాహిని స్టూడియో నిర్మాతలకు ఒక ఆనవాయితి. తమిళనాట సినిమారంగంలో ఈ ఆనవాయితీ ఇప్పుడు కూడా నడుస్తోంది. ఇక అన్నగారి సినిమాల్లో మాత్రం సావిత్రి హీరోయిన్ గా ఎక్కువ నటించేవారు. ఆమె భోజన ప్రియురాలు. మరీ ముఖ్యంగా మాంసాహారం అంటే ఎక్కువగా ఇష్టపడేదట. ఎన్టీఆర్ కి కూడా మాంసాహారం అంటే చాలా ఇష్టం.. ఎన్టీఆర్ తో పాటుగా నటీనటులకు కూడా పీతలు, రొయ్యలు, చేపల పులుసు తో పాటు నాటు కోడి ఇంకా రెండు మూడు రకాల ఆహార పదార్ధాలు చేయించి తెచ్చే వారని తెలుస్తోంది. ఈ సంప్రదాయాన్ని శారదా కొన్నాళ్లు పాటించారు… దీని తర్వాత వాణిశ్రీ కొనసాగించారు. వాణిశ్రీ కూడా ఎన్టీఆర్ కొరకు రకరకాల వంటకాలు వండి తెచ్చి సెట్లో ఆయనకు పెట్టేవారట.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నిర్మలమ్మ కూడా ఈ ఆనవాయితీని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే.

Recent Posts

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

4 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

7 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

8 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

8 hours ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

9 hours ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

10 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

11 hours ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

12 hours ago