Anchor Rashmi Gautam About Animals ni champadam
Rashmi Gautam : యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం బుల్లితెరపై ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అనసూయ కూడా ఈటీవీ నుంచి వెళ్లిపోవడంతో రష్మీకి మరింత చాన్సులు వస్తున్నాయి. ఇటు సుధీర్ వెళ్లిపోవడం, అటు అనసూయ వెళ్లిపోవడంతో రష్మీకి బాగానే కలిసి వచ్చింది. సుధీర్ బయటకు వెళ్లడంతో శ్రీదేవీ డ్రామా కంపెనీకి రష్మీ యాంకర్‌గా మారింది. ఇటు అనసూయ వెళ్లిపోవడంతో జబర్దస్త్ షోకు యాంకర్‌గా మారింది రష్మీ. అలా మొత్తానికి ఈ మూడు షోల్లోనూ ఇప్పుడు రష్మీనే కనిపించబోతోంది. ఇలా రష్మీ గౌతమ్ బుల్లితెరపై ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్‌కు అందుబాటులోనే ఉంటుంది. ఫ్యాన్స్ చేసే కామెంట్స్, తన పేరిట చేసే సేవా కార్యక్రమాల మీద స్పందిస్తుంది.
మరీ ముఖ్యంగా రష్మీ మూగ జీవాల పట్ల మక్కువ చూపిస్తుంటుంది. రష్మీ జంతు ప్రేమికురాలన్న సంగతి అందరికీ తెలిసిందే. రష్మీ చేసే మంచి పనులు, మూగ జీవాల పరిరక్షణకు చేసే పనులు, పడే తాపత్రయంతో అందరి అభిమానాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు అంటూ మూగ జీవాలను బలి ఇవ్వడాన్ని రష్మీ వ్యతిరేకిస్తుంది. అది బక్రీద్ అయినా దసరా అయినా ఇలా ఏ పండుగ అయినా ఏ మతానికి సంబంధించిన ఆచారమైనా కూడా రష్మీ వ్యతిరేకిస్తుంటుంది. సంక్రాంతి కోళ్ల పందెలైనా సరే వ్యతిరేకిస్తుంది. ఇక పెట్స్ సంరక్షణ కోసం రష్మీ ముందుంటుంది.
Anchor Rashmi Gautam About Animals ni champadam
వీధుల్లో గాయపడిన పెట్స్‌ను తెచ్చి కాపాడుతుంది. ఇంట్లోనే పెట్టుకుని పోషిస్తుంటుంది. అలాంటి రష్మీ తాజాగా ఓ నెటిజన్ వేసిన పోస్ట్ మీద ఘాటుగా స్పందించింది. ఓ జంతువును బలి ఇస్తున్న ఫోటోను రష్మీకి ట్యాగ్ చేశాడు. దీనిపై రష్మీ స్పందించింది. ఇలా కేవలం నాకు ట్యాగ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మీ డీటైల్స్.. అది జరిగిన ప్లేస్, దాని డీటైల్స్ పంపిస్తేనే నేను ఏమైనా చేయగలను.. మీరు కూడా ఈ పోరాటానికి సిద్దంగా ఉండాలి అంటూ నెటిజన్‌కు సూచించింది.
Anchor Rashmi Gautam About Animals ni champadam
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.