Aadi SaiKumar : ఎవరండీ ఆ హీరో మార్కెట్ అయిపోయింది అన్నది.. సెట్స్ మీదే లాభాలు తెలుసా..!
ప్రధానాంశాలు:
Aadi Sai Kumar : ఎవరండీ ఆ హీరో మార్కెట్ అయిపోయింది అన్నది.. సెట్స్ మీదే లాభాలు తెలుసా.!
Aadi SaiKumar : సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే బిజినెస్ Inspector Yugandhar జరిగితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ముఖ్యంగ అసలేమాత్రం ఫాం లో లేని ఒక హీరో సినిమా ఇలా షూటింగ్ టైం లోనే డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయట. అంతేకాదు హిందీ శాటిలైట్ రైట్స్ కూడా సేల్ అయినట్టు టాక్. ఫ్లాపులో ఉన్న ఆ హీరో మార్కెట్ పడిపోయిందని అసలు మార్కెట్ లేదన్న వార్తలు వచ్చాయి. అది కొంతమేరకు వాస్తవం కూడా కానీ అతను మాత్రం అవేవి పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే ఆది సాయి కుమార్.. సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది సాయి కుమార్ కెరీర్ లో ఒకటి రెండు హిట్లు తప్ప పెద్దగా సక్సెస్ రేటు లేదు. అయినా కూడా అతను వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆది సాయికుమార్ Aadi SaiKumar చేస్తున్న ఇన్ స్పెక్టర్ యుగంధర్ సినిమా Inspector Yugandhar షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే మంచి బిజినెస్ జరుగుతుంది.

Aadi SaiKumar : ఎవరండీ ఆ హీరో మార్కెట్ అయిపోయింది అన్నది.. సెట్స్ మీదే లాభాలు తెలుసా..!
Aadi SaiKumar : పకడ్బందీ ప్లానింగ్ తో ఈ సినిమా..
ఆది సాయి కుమార్ ఈసారి చాలా పకడ్బందీ ప్లానింగ్ తో ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. సాయి కుమార్ పోలీస్ స్టోరీ తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది ఆయన రేంజ్ సక్సెస్ అందుకోలేదు. ఐతే ఆది సాయి కుమార్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. ఆది సాయి కుమార్ ఇన్ స్పెక్టర్ యుగంధర్ సినిమా బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి సినిమాకు మంచి ప్రమోషన్ చేసే ఛాన్స్ లు ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ పొందినట్టు తెలుస్తుంది. ఈమధ్య ఈటీవీ విన్ లో వస్తున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. సో కచ్చితంగా ఈ సినిమా కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఆది సాయి కుమార్ కెరీర్ లో ఒక మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి అది ఈ సినిమా అవుతుందా లేదా అన్నది చూడాలి. Aadi Sai Kumar, Inspector Yugandhar, Sai Kumar, Tollywood