Acharya Movie : ఆచార్య సినిమాలో సస్పెన్స్ బయటపెట్టిన ట్రైలర్.. డైరెక్టర్ ప్లాన్ ఇదేనంట..
Acharya Movie : ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సైరా నరసింహా రెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ సిద్ధ అనే పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నారు. అయితే అనేక సార్లు వాయిదా పడుతూ వస్తున్నా ఎట్టకేలకు ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేయనుంది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టెయిన్‌మెంట్స్ బ్యానర్ పై రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు.
ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ సిద్ద పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా.. రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డె నటించింది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌లో గెస్ట్ పాత్ర పోషించిన పూజా హెగ్డెని చూపించారు కానీ, ప్రధాన కథానాయిక అయిన కాజల్ ఒక్క ఫ్రేములో కూడా కనిపించలేదు.ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. మెగాస్టార్ అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా అద్భుతమైన ఎలివేషన్స్, చిరంజీవి మార్క్ వార్నింగ్స్, డైలాగ్స్ తో కొరటాల శివ.. ఆచార్య చిత్రాన్ని వడ్డించబోతున్నారు. సినిమా మొత్తం దేవాలయాలు, నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు ఉంది. దీంతో చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి.కాగా ఈ సినిమా ట్రైలర్‌ను కూడా ఒకటికి రెండు సార్లు వాయిదా వేసి ఎట్టకేలకు మంగళవారం రిలీజ్ చేశారు.
Acharya Movie : ట్రైలర్ చూస్తుంటే…
చిరంజీవి, రామ్ చరణ్ తమదైన నటనతో అదరగొట్టారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ధర్మస్థలి.. అపధర్మస్థలి ఎలా అవుతది ?, పాదఘట్టం వాళ్ల గుండెలపై కాలు వేస్తే.. ఆ కాలు తీసేయాలట.. వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు ఇంకాస్తా పెరిగేలా చేశాయి.అయితే ట్రైలర్ సినిమాపై మెగా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటే మరి కొందరు మెగా అభిమానులు మాత్రం కాస్త నిరుత్సాహంగా ఉందంటున్నారు. ఈ సినిమాలో హీరోగా చిరంజీవిని అనుకోవాలా..లేక రామ్ చరణ్ హీరో అనుకోవాలా అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదంతా డైరెక్టర్ కొరటాల శివ సస్పెన్స్ అని పలువురు అంటున్నారు.