Actor Wife : చాలా అమ్మా.. భర్తతో విడాకులు.. నెలకి రూ. 40 లక్షలు భరణం కావాలట..!
ప్రధానాంశాలు:
Actor Wife : చాలా అమ్మా.. భర్తతో విడాకులు.. నెలకి రూ. 40 లక్షలు భరణం కావాలట..!
Actor Wife : ప్రముఖ తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తిల విడాకుల కేసు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు రాగా, విడాకులు కోరుతున్న తన భర్త జయం రవి నుంచి నెలకు రూ. 40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించలేనని జయం రవి స్పష్టం చేసినట్లు సమాచారం. విడాకులు మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించినట్లు తెలిసింది.

Actor Wife : చాలా అమ్మా.. భర్తతో విడాకులు.. నెలకి రూ. 40 లక్షలు భరణం కావాలట..!
Actor Wife : అంత భరణమా ?
ఈ నేపథ్యంలోనే ఆర్తి భరణం కోసం పిటిషన్ వేశారు. అనంతరం, న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది.తమిళ హీరో జయం రవి, అతని భార్య ఆర్తి ని 2009లో వివాహం చేసుకున్నాడు. వారి దాంపత్యం 15 ఏళ్ల పాటు సంతోషంగా సాగింది. అయితే, వారి మధ్య తలెత్తిన మనస్పర్థలు గొడవలకు దారి తీశాయి. దీంతో జయం రవి తన భార్య ఆర్తి కి విడాకులు ఇచ్చాడు
అయితే తాము విడిపోవడానికి ఓ మూడో వ్యక్తే కారణమని, అందుకు తన వద్ద ఆధారాలున్నాయని సోషల్ మీడియాలో నిన్న మరో పోస్ట్ పెట్టారు. ఇకపై తాను మాట్లాడనని, న్యాయస్థానంపై నమ్మకం ఉందని ఆమె స్పష్టం చేశారు. అయితే ఆర్తి రూ.40 లక్షలు భరణం కోరడంతో ఏమ్మా నెలకు 40 లక్షలు సరిపోతాయా అంటూ ట్రోల్ చేస్తున్నారు. భరణం ఇప్పించాలని కోరడంలో తప్పు లేదని సినిమాకు 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరో నుంచి 40 లక్షలు భరణం అడగడం మాత్రం న్యాయం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.