Actor Kantha Rao : ఒకప్పుడు మద్రాస్ బంగ్లాలో.. ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాం.. మమ్మల్ని ఆదుకోండి.. కాంతారావు కొడుకు భావోద్వేగం
Actor Kantha Rao : అలనాటి నటుడు కాంతారావు తెలుసు కదా. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలోనే సోషియో ఫాంటసీ సినిమాలను తీశారు ఆయన. 400 కు పైగా పౌరాణిక, జానపద, సాంఘీక సినిమాల్లో కాంతారావు నటించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఒక కన్ను వంటి వారు. ఆయన శత జయంతి ఉత్సవాలను తాజాగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈసందర్భంగా కాంతారావు కొడుకు రాజా మాట్లాడుతూ..
భావోద్వేగానికి గురయ్యారు. మా తండ్రి తనకు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని సినిమాలు తీశారు. ఒకప్పుడు మేము మద్రాస్ బంగ్లాలో ఉండేవాళ్లం. కానీ.. ఇప్పుడు సిటీకి దూరంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఆస్తులన్నీ అమ్ముకోవడంతో ఇప్పుడు చేతుల్లో చిల్లిగవ్వ లేదని.. తమను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు. తమకు కనీసం ఒక ఇల్లు అయినా కేటాయించాలని కోరారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడకు సమీపంలోని గుడిబండ అనే మారుమూల గ్రామం కాంతారావు సొంతూరు.
Actor Kantha Rao : తెలంగాణకే చెందిన కాంతారావు ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్టించారు
అప్పట్లో నాటకాలు, సినిమా మీద ఉన్న ఆసక్తితో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. మద్రాస్ వెళ్లి అక్కడ తన టాలెంట్ ను నిరూపించుకొని తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు కాంతారావు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. ఆయన 99 వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా నివాళులర్పించారు. ఆయన 400 కు పైగా సినిమాల్లో నటించారని తెలిపారు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాంతారావు.. సినీ కళామతల్లికి నుదుట తిలకంగా అభివర్ణించారు.