Naresh – Pavitra Lokesh : మూడో భార్యకి ఊహించని షాక్.. పవిత్రను పెళ్లి చేసుకున్న నరేష్ వీడియో వైరల్..!!
Naresh – Pavitra Lokesh : ఏడాది పైగా నుండి సీనియర్ నటుడు నరేష్… సీనియర్ నటి పవిత్రతో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. “మా” అధ్యక్షుడిగా నరేష్ పోటీ చేసిన నాటినుండి… వీరిద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అయింది. ఆ సమయంలో నరేష్ కి మద్దతుగా.. ప్రచారంలో సీనియర్ నటి పవిత్ర కీలకంగా రాణించడం జరిగింది. అప్పటినుండి నరేష్ తో.. క్లోజ్ గా పవిత్ర ఉండటం జరిగింది. వీరిద్దరి బంధం గురించి సోషల్ మీడియాలో ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల వార్తలు రావడం జరిగాయి.
ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 31 వ తారీకు నాడు… వచ్చే సంవత్సరం కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు పవిత్ర నీ పెళ్లి చేసుకోబోతున్నట్లు నరేష్ తెలియజేయడం జరిగింది. అయితే నరేష్ చెప్పినట్టుగానే ఇప్పుడు పవిత్రని పెళ్లి చేసుకుని.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ట్విట్టర్ వేదికగా నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.”
ఒక పవిత్ర బంధం… రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ… ఇట్లు మీ పవిత్ర నరేష్” అని ట్వీట్ చేశారు. అయితే మూడో భార్య రమ్యతో విడాకులు కాకుండానే పవిత్రను.. నరేష్ పెళ్లి చేసుకోవటం సంచలనంగా మారింది. ఈ క్రమంలో మూడో భార్య రమ్య ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నరేష్ మరియు పవిత్రాల పెళ్లి వీడియో వైరల్ గా మారింది.