Actress Dimple Hayathi covid positive
Dimple Hayathi : ఈ సారి కరోనా మహమ్మారి సినీ సెలబ్రిటీలను ఎక్కువగా వణికిస్తుంది. సౌత్, నార్త్ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. రోజుల వ్యవధిలో వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కరోనా బారినపడ్డారు. సూపర్ స్టార్ మహేష్ కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన తిరిగి కోలుకున్నారు. అలాగే మంచు మనోజ్, మంచు లక్ష్మి, త్రిష, బండ్ల గణేష్, సత్యరాజ్, విశ్వక్ సేన్ , మమ్ముట్టి తదితరులు తమకు కరోనా సోకినట్టు వెల్లడించారు. తాజాగా రవితేజ హీరోయిన్‌కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ చిత్రం లో హీరోయిన్ పాత్ర చేస్తున్న సౌత్ ఇండియన్ నటి డింపుల్ హయాతీ. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్‌లోను రచ్చ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు వెల్లడించడం జరిగింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనావైరస్ బారిన పడినట్లు డింపుల్ హయాతి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పూర్తిగా టీకాలు వేసుకున్న ఈ బ్యూటీ తనకు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది.
Actress Dimple Hayathi covid positive
తనకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన సందర్భంగా తన అభిమానులను, అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, టీకాలు వేయించుకోవాలని, చేతులను పూర్తిగా శుభ్రపరచుకోవాలని అభ్యర్థించింది. అంతేకాకుండా గతంలో కంటే బలంగా తిరిగి వస్తానని ఫ్యాన్స్ కు హామీ ఇచ్చింది. మరోవైపు “ఖిలాడీ” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 11న విడుదల కావలసిన ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో ఓ కథానాయికగా డింపుల్ నటిస్తుంది
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.