Home » Entertainment » Actress Hari Teja Enjoys At Belgium
Entertainment

Hari Teja : పొట్టి గౌనులో చిందులు.. నడివీధుల్లో హరితేజ హల్చల్

Authored By
aruna
The Telugu News | Published on: July 29, 2022, 6:40 pm
Advertisement

Hari Teja : బిగ్ బాస్ హరితేజ ఈ మధ్య ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది తల్లైన హరితేజ ఎంతో మార్పుకు గురైంది. అయితే ఎంతో కష్టపడి, వ్యాయామాలు చేస్తూ, వర్కవుట్లలో మునిగి తేలుతూ మళ్లీ పాత రూపాన్ని తెచ్చుకుంది. అయితే ఇప్పుడు హరితేజ ఎంతగా మారిపోయిందంటే.. అందరూ ముక్కున వేలేసుకునేలా మారిపోయింది. ఆమె మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడేంత వరకు వచ్చింది. హరితేజ తల్లైన తరువాత కొన్ని ఫోటో షూట్లు చేసింది. అందాలను ప్రదర్శిస్తూ కురచ దుస్తులను ధరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement

దీంతో నెటిజన్లు ఆమె మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఇలాంటి ఫోటో షూట్లు అవసరమా? తల్లివి అయ్యావ్ కదా? అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి హరితేజ వార్తల్లోకి ఎక్కేసింది. హరితేజ ఈ మధ్య తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి ఫారిన్ ట్రిప్‌లకు వెళ్తోంది. గత నెలలో హరితేజ, నవ్యస్వామి, ఐశ్శర్యలు ఫ్యామిలీలు కలిసి మాల్దీవులకు వెళ్లాయి. అక్కడి బీచుల్లో వీరంతా కూడా నానా రచ్చ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి ఫారిన్ వెకేషన్‌కు వెళ్లారు.

Actress Hari teja Enjoys At Belgium

Advertisement

అయితే ఈ సారి లొకేషన్ మారింది. నెదర్లాండ్, బెల్జియం అంటూ రచ్చ చేస్తున్నారు. ఇక ఫారిన్ కంట్రీ కాబట్టి.. ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి.. ఏం చేసినా పర్లేదనుకుందో ఏమో గానీ.. పొట్టి గౌనులో హరితేజ రెచ్చిపోయింది. బుల్లి గౌను వేసుకుని.. థైస్ కనిపించేలా వీధుల్లో చిందులు వేసింది. ప్రస్తుతం ఈ రీల్ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె వస్త్రాధారణ మీద ఫైర్ అవుతున్నారు. ఇలాంటి బట్టలు ఏంటి? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి