Anchor Suma : యాంకర్ సుమను పరుగులు పెట్టించిన హేమ.. షోలో నటి వీరంగం

 Authored By prabhas | The Telugu News | Updated on :16 April 2022,7:35 pm

Anchor Suma : నటి హేమ మీడియా ముందు చేసే హంగామా అందరికీ తెలిసిందే. ఆమె మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఈమె బుల్లితెరపై కనిపిస్తే చాలు సందడి వాతావరణం నెలకొంటుంది. తాజాగా ఆమె సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చింది. ఇందులో హేమ చేసిన పనికి సుమ పరుగులు పెట్టేసింది. షో సెట్ అంతా కూడా పరుపరుగునా వెళ్లింది. ఇంతకీ సుమ ఎందుకు అలా పరిగెత్తిందో చూద్దాం.మా ఎన్నికల సమయంలో హేమ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. శి

వ బాలాజీ చేతిని కొరకడం ఎంత వివాదంగా మారిందో అందరూ చూశారు. కొరికింది వేరే చోట..వాళ్లు చూపించింది వేరే చోట.. మీడియా రాసింది ఇంకో చోట అని హేమ తెగ వాపోయింది. అసలు నేను అంత గట్టిగా కొరకలేదు కానీ సీన్ చేశారంటూ శివ బాలాజీ మీద హేమ ఫైర్ అయింది. శివ బాలాజీ వర్సెస్ హేమ ఎపిసోడ్ బాగానే హైలెట్ అయింది.ఇక అదే ఎపిసోడ్ ఇక్కడ రిపీట్ చేయబోయింది హేమ. మీకు కోపంవస్తే చేసే పని ఏంటి? అని సుమ అడుగుతుంది. కొరకడం అంటూ నాటి సీన్‌ను హేమ గుర్తుకు చేస్తుంది.

Actress Hema Fun With Anchor Suma In Cash SHow

Actress Hema Fun With Anchor Suma In Cash SHow

దెబ్బకు భయపడ్డ సుమ.. పరుగులు పెట్టేస్తుంది. అయినా సుమ వెనకాల హేమ పరిగెడుతూనే ఉంది. మొత్తానికి హేమ మాత్రం సుమను వెంబడించేసింది. సుమనే భయపెట్టేసింది. ఇక ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ ఎపిసోడ్‌లో పోసాని, కృష్ణ భగవాన్, సమీర్‌లు చేసిన సందడి, వారు పేల్చిన పంచులు, వేసిన కౌంటర్లు తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సమీర్ మీద సుమ వేసిన పంచ్‌లు, కృష్ణ భగవాన్ మీద సమీర్ వేసిన కౌంటర్లు వైరల్ అవుతున్నాయి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి