Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మతులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!
ప్రధానాంశాలు:
Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మతులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మానందంతో కలిసి చేసిన ఎన్నో సినిమాల్లోనూ ఆమె హాస్యపాత్రలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. “అతడు”, “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” లాంటి చిత్రాల్లో ఆమె పాత్రలు ఎంతో గుర్తుండిపోయేలా మారాయి. హాస్యనటిగా ఆమెకు నంది అవార్డు కూడా లభించింది.

Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మతులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!
Hema Daughter : కూతురు కేక..
హేమ అసలుపేరు కృష్ణవేణి, అయితే సినీ రంగంలో అడుగుపెట్టిన తరువాత హేమగా తన పేరు మార్చుకున్నారు. ఇప్పటివరకు 250కి పైగా చిత్రాల్లో నటించిన హేమ కెరీర్‌లో తనకు తగిన స్థానం సంపాదించుకున్నారు. మా ఎలెక్షన్స్ సమయంలో చేసిన వ్యాఖ్యలు, ఇటీవల రేవ్ పార్టీ కేసులో పేరు చర్చకు రావడం, డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు ఇవన్నీ హేమపై విమర్శలు తెచ్చిపెట్టాయి.
అయితే ఈ ఆరోపణలన్నింటినీ హేమ ఖండించారు. ప్రస్తుతం సినిమాల్లో హేమకి ఆఫర్లు తక్కువయ్యాయి. ఇంతకీ నటి హేమకి ఒక కుమార్తె ఉన్న సంగతి ఎంతోమందికి తెలియదు. ఆమె పేరు ఇషా. హేమ తన జీవిత భాగస్వామి సయ్యద్ జాన్ అహ్మద్ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పుట్టిన కుమార్తె ఇషా ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉంది.ఇప్పటికే సోషల్ మీడియాలో ఇషా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలామంది నెటిజన్లు “ఇషా లుక్ చూస్తే ఏ హీరోయిన్‌కీ తీసిపోదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.