Kajal Aggarwal : వెరైటీగా విమానాశ్రయంలో ఫస్ట్ టైం కొడుకుని మీడియా ప్రతినిధులకు చూపించిన కాజల్ అగర్వాల్ వీడియో వైరల్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kajal Aggarwal : వెరైటీగా విమానాశ్రయంలో ఫస్ట్ టైం కొడుకుని మీడియా ప్రతినిధులకు చూపించిన కాజల్ అగర్వాల్ వీడియో వైరల్…!!

Kajal Aggarwal : “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ అందరికీ సుపరిచితురాలే. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :20 March 2023,9:00 am

Kajal Aggarwal : “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ అందరికీ సుపరిచితురాలే. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోలతో సినిమా అవకాశాలు అందుకొని తెలుగులో మాత్రమే కాదు సౌత్ లో బిజీ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో చక్రం చెప్పింది.

Actress Kajal Aggarwal Introduced Her Son Gautam Kitchlu To Media

Actress Kajal Aggarwal Introduced Her Son Gautam Kitchlu To Media

ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రారంభంలో వరుస పెట్టి అవకాశాలు అందుకున్న కాజల్ అగర్వాల్ పరాజయాలు బ్యాక్ టు బ్యాక్ రావడంతో మళ్లీ లైఫ్ ఇచ్చిన సంస్థ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే రీఎంట్రీలో కాజల్ అగర్వాల్ కి అంతగా అవకాశాలు రాలేదు. చాలావరకు సీనియర్ హీరోల సినిమాలలో కనిపించడం జరిగింది. అయితే కరోనా టైములో బంధువుల సమక్షంలో కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీకి దూరమయింది.

Kajal Aggarwal comments after marriage

Kajal Aggarwal comments after marriage

ఆ తర్వాత ఒక బాబుకీ జన్మనివ్వడం జరిగింది. ఏడాది కంటే ఎక్కువ వయసు కలిగిన కాజల్ బాబుని చాలా సందర్భాలలో బయటకొచ్చిన ఫేస్ కనిపించకుండా దాచేసేది. కానీ ఫస్ట్ టైం ఇటీవల ముంబై విమానాశ్రయంలో చాలా వెరైటీగా అందరికీ కాజల్ అగర్వాల్ తన కొడుకు గౌతమ్ కిచ్చులు ఫేస్ చూపించింది. దీంతో ఫోటోగ్రాఫర్లు చక్క చక్క ఫోటోలు క్లిక్ చేసి… ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఫోటోలు మాత్రమే కాదు వీడియోలు కూడా పోస్ట్ చేశారు. దీంతో కాజల్ అగర్వాల్ కొడుకు వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది