Actress Laya : పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత తొలిసారి తిరుమలకు వచ్చిన నటి లయ.. ఆమె పక్కనున్న వ్యక్తి ఎవరో తెలుసా?
Actress Laya : సీనియర్ నటి లయ తెలుసు కదా. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తన గురించే చర్చ. చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. లయ అంటే ఈ జనరేషన్ యూత్ కు తెలియకపోవచ్చు కానీ.. 80స్, 90స్ కిడ్స్ కి లయ సుపరిచితమే. అప్పట్లో లయ స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు 5 ఏళ్ల పాటు అందరు స్టార్ హీరోల సరసన నటించి అలరించింది లయ.
ఆ తర్వాత సడెన్ గా సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. పెళ్లి చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది. కొన్ని నెలల కిందనే భారత్ కు వచ్చిన లయ.. మళ్లీ ఇండస్ట్రీలో తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మధ్య తను ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే తన పర్సనల్, సినిమా లైఫ్ కు సంబంధించిన చాలా విషయాలను ఆమె షేర్ చేసుకుంది. ఇక.. లయ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
Actress Laya : తిరుమలలో లయను చూసి ఎగబడ్డ భక్తులు
తనకు పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత తొలిసారి లయ తిరుమలను దర్శించుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి లయ తిరుమలను దర్శించుకుంది. తిరుమలలో లయను చూసిన భక్తులు… ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఆ తర్వాత ఆమె మీడియాతో కాసేపు మాట్లాడారు. ఆమె వెంట తన కుటుంబ సభ్యులు ఉన్నారు. తిరుమలలో లయకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
