samantha : సమంత కు మద్దతుగా మాధవిలత.. ‘ నేనూ వారిపై కేస్ పెడతా తగ్గేదేలే’ అంటూ సంచలన వ్యాఖ్యలు..!
samantha : తెలుగు స్టేట్స్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా.. ఊ అంటావా మామ ఊ ఊ అంటావా అనే పాట వినిపిస్తోంది. క్లబ్బుల్లో, పబ్బుల్లో, ప్రైవేట్ పార్టీల్లో అంతా ఈ పాట పెట్టుకుని ఊగి పోతున్నారు. పుష్ప సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతీ పాటకు మంచి పేరు రాగా… ఇటీవల విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సాంగ్ కు బన్నీ తో పాటు సమంత స్టెప్పులేయడంతో ఆ పాటకి మరింత క్రేజ్ వచ్చింది. ఫోక్ సింగర్ మంగ్లి చెల్లెలు ఇంద్రావతి చౌహన్ మత్తు వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్‌కు శ్రోతలకు కిక్కిస్తోంది.యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే ఇదిలా ఉండగా పాటకు ఎంత పేరైతే వస్తుందో… అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ పాటలో వాడిన పదాలు పురుషుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ ఏపీ పురుషుల సంఘం. ఆంధ్రప్రదేశ్ కోర్టును ఆశ్రయించింది. చిత్ర బృందం తో పాటు పాటలో నటించిన సమంతపై కూడా కేసు పెట్టింది. అయితే ఎప్పుడూ వివాదాల్లో తల దూరుస్తూ ఉండే నటి మాధవి లత ఈ వివాదంపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.మాధవి లత తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ విధంగా స్పందించింది. “వాయమ్మో.. పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా.. ఈ లెక్కన ఇండస్ట్రీలో 90% సాంగ్స్ అలాగే ఉంటాయి. సాంగ్స్ లేని సినిమాలు చేయాలి.
samantha : తగ్గేదేలే నేనూ పెడతా కేసు…:
అయితే నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకు కేసులు పడతా.. రారా సామి సాంగ్ మీద.. ఏంటీ ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పోలిస్తే అంత చులకనగా వెంట పడి వెళ్లిపోద్దా ? అబ్బాయి నడిచిన చోట భూమిని టచ్ చేసి మొక్కుతుదా… ఒక మహిళ పరువు పోయింది. ఛ.. నాకు నచ్చలే.. నేను పెడతా కేసు.. అంతే తగ్గేదేలే..” అంటూ వివాదాన్ని మరింత వివాదం చేసింది. అయితే మాధవి చేసిన ఈ కామెంట్లకు పలువురు మహిళలతో పాటు పురుషులూ తమ మద్దతును తెలుపుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.