Pragathi : వర్కవుట్లతో వేడిపుట్టిస్తోంది.. ప్రగతి వీడియో వైరల్
నటి ప్రగతి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్టార్. గత ఏడాది లాక్డౌన్ నుంచి ప్రగతి సోషల్ మీడియాను ఊపేయడం ప్రారంభించింది. గతేడాది లాక్డౌన్ సమయంలో ప్రగతి షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. డ్యాన్సింగ్ వీడియోలు, వర్కవుట్ల వీడియోలతో ప్రగతి ఫుల్ ఫేమస్ అయింది. ప్రగతి ఫిట్ నెస్, ఆ వీడియోలకు అందరూ ఫిదా అయ్యారు. దీంతో ప్రగతి ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమెకు అవకాశాలు మరింతగా పెరిగాయి.

Actress Pragathi about will power
ప్రగతికి మారిన ఇమేజ్‌తో కొత్త కొత్త పాత్రలు వచ్చేశాయి. బుల్లితెర, వెండితెర, యాడ్స్ ఇలా ఎన్నెన్నో ఆఫర్లు ఆమెకు వచ్చాయి. సినిమాల్లోనూ పవర్పుల్ రోల్స్ వచ్చాయి. మొత్తానికి ప్రగతి మాత్రం ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే ఇప్పుడు కూడా లాక్డౌన్ ఉండటంతో మళ్లీ వీడియోలతో రెచ్చిపోతోంది. తాజాగా ఆమె వదిలిన ఓ వీడియో చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సింది.
ఇంట్లోనే ప్రగతి తెగ కష్టపడిపోతోన్నట్టున్నారు. వర్కవుట్లు చేసి జీరో సైజ్‌లోకి రావాలని ప్రగతి ఆరాట పడుతున్నట్టు కనిపిస్తోంది. విల్ పవర్ అనే కనిపించదు.. మనమే దాన్ని క్రియేట్ చేయాలనే కొటేషన్‌ను చెబుతూ ఆమె షేర్ చేసిన వర్కవుట్ వీడియో వైరల్ అవుతోంది. సినిమాలో హీరోలు కష్టపడుతున్నట్టుగా ప్రగతి వర్కవుట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు.
View this post on Instagram