Home » Entertainment » Actress Pragathi On Ttd Laddu Prasadam Video
Entertainment

Pragathi : నేను ఎంత అదృష్టవంతురాలినో.. ప్రగతి వీడియో వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 1, 2022, 5:30 pm
Advertisement

Pragathi : టాలీవుడ్ కారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతికి నెట్టింట్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ కరోనా, లాక్డౌన్ పుణ్యమా అంటూ ప్రగతి ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఫస్ట్ లాక్డౌన్ పుణ్యమా అని అందరూ ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. అలా అందరూ ఓ ఐదారు నెలలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చిన సమయంలో ప్రగతి కొత్తగా ఆలోచించింది.ప్రగతి రెండేళ్ల క్రితం ఇన్ స్టాగ్రాంలో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. మాస్ డ్యాన్సులు వేస్తూ, లుంగీలు కట్టుకుని ఊరనాటు స్టెప్పులు వేసి తెగ పాపులర్ అయింది. క్లాసికల్ డ్యాన్సులు, మాస్ స్టెప్పులు వేస్తూ ప్రగతి రచ్చ చేసింది.

Advertisement

అలా ప్రగతి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారుతూ వచ్చింది. అయితే ఆ తరువాత వర్కవుట్ల వీడియోలతో నానా హంగామా చేసింది.ప్రగతి చేసే వర్కవుట్లు చూసి అందరూ ఫిదా అవుతుంటారు. నాలుగు పదుల వయసులోనూ ఇంత ఫిట్, స్ట్రాంగ్‌గా ఉండేందుకు ప్రగతి కష్టపడుతున్న తీరు చూసి అందరూ ఇన్‌స్పైర్ అవుతుంటారు. ఇదే విషయాన్ని పలువురు ఆమెతో పంచుకుంటారు. ఇలా అందరూ ఇన్ స్పైర్ అవ్వాలనే తాను వర్కవుట్లు చేసి వీడియోలను షేర్ చేస్తుంటాను అని చెప్పుకొచ్చింది.అయితే తాజాగా ప్రగతి ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఓ గంపను మోసుకొచ్చింది.

Pragathi On TTD Laddu Prasadam Video

Advertisement

ఇక అందులో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ప్రసాదాలున్నాయి. వాటిని అందరికీ చూపిస్తూ వీడియోను చేసింది. నేను ఎంత అదృష్టవంతురాలిని.. ఆ దేవుడి ప్రసాదం, ఆశీర్వదాలు అందాయన్నట్టుగా చెప్పుకొచ్చింది.ఇక వీటిని విందు పదార్థాలు ఆరగించినట్టుగా ఆరగించేసింది. అలా తినడం చూసిన జనాలు.. అది ప్రసాదం, ప్రసాదంలా తినండి.. మాకు కూడా కాస్త పెట్టండి.. ప్రసాదాన్ని పంచాలి అని చెప్పుకొచ్చారు. ఇక గీతా మాధురి భర్త నందు కూడా అలానే అడిగాడు. ప్రసాదాన్ని పంచుకోవాలని అన్నాడు. ఇస్తాను అన్నట్టుగా ప్రగతి చెప్పుకొచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి