Sadha : ఆ హీరోని తెగ‌ ప్రేమించిన స‌దా పెళ్లి మాత్రం చేసుకోలేక‌పోయింద‌ట‌..!

Advertisement

Sadha : జ‌యం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ స‌దా. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ఒక‌ప్పుడు మంచి సినిమాల‌లో న‌టించిన స‌దా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాలకు దూరమైనా తమిళ్, తెలుగు బుల్లితెరలపై ఆయా షో లలో కనిపిస్తూ వినోదాన్ని పంచుతోంది. ఇటీవలే సదా నటించిన హ‌లో వ‌ర‌ల్డ్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకుంది. అయితే ఈ అమ్మ‌డు రీసెంట్‌గా పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని చెప్పింది. 38 ఏళ్లు వచ్చినా పెళ్లికాకపోతే నాకు లేని బాధ వాళ్లకి ఎందుకు ? అని ప్ర‌శ్నించింది.

Advertisement

Sadha : ఛాన్స్ మిస్ అయిందా?

10 పెళ్లిళ్లు జరిగితే.. వాటిలో 5 జంటలైనా హ్యాపీగా ఉండట్లేదని కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయింది సదా. పోనీ పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాడు అయి ఉండాలి అన్న ప్రశ్నకు తన మదిలో మాట చెప్పింది. తనను పెళ్లి చేసుకునే వ్యక్తి ధనవంతుడు కాకపోయినా ఫర్వాలేదు కానీ.. బ్రతకడం కోసం పక్కవారిపై ఆధారపడకూడదని చెప్పింది. తన అవసరాల కోసమైనా తాను సంపాదించుకోగలగాలని, అలాగే పూర్తి శాఖాహారి అయి ఉండాలని సదా మదిలో మాట చెప్పింది. అయితే ఈ అమ్మ‌డు తమిళ్ లో హీరో మాధవన్ తో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేసింది. వీటిలో ప్రియా సఖి సినిమా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అయితే ఆ సమయంలో సదా.. మాధవన్ పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

Advertisement
actress sadha was shocked and saddened to hear rumours
actress sadha was shocked and saddened to hear rumours

ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ తమ కుటుంబ పరిస్థితుల రీత్యా సదా తన ప్రియుడిని పెళ్లి చేసుకోలేకపోయిందని కొందరు చర్చించుకుంటున్నారు.. అందుకే నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నప్పటికీ తన ప్రియుడిని మర్చిపోలేక నటి సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ వార్తలు గత వారం రోజులుగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేక్ చేస్తున్నాయి. అయితే ఆ వార్తలు విని తాను చాలా బాదపడ్డానని అన్నారు స‌దా. మొదట్లో చాలా బాధగా అనిపించింది. కానీ ఆలాంటి రూమర్స్ రావడం కామనే అని ఇప్పుడు పట్టించుకోవడం మానేశా అని చెప్పుకొచ్చింది. నాకు నచ్చిన అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ‌.

Advertisement
Advertisement