Sadha : ఇష్టం లేదు అంటూనే ఆ పని చేసింది.. సదా ఏంటి ఇలా చేసింది.. ఈ వయసులో అలాంటి పనులు అవసరమా?
Sadha : సీనియర్ నటి సదా తెలుసు కదా. తను ఏం చేసినా సంచలనమే. అప్పట్లో జయం సినిమాలో తన క్యారెక్టర్ మామూలుగా ఉండదు. ఆ సినిమాతోనే తనకు పిచ్చి ప్యాన్స్ అయిపోయారు జనాలు. లంగావోణి వేసుకొని వెళ్లవయ్యా వెళ్లు అంటూ సదా చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇప్పటికీ ఆ డైలాగ్ ను వాడుతున్నారు అంటే.. ఆ సినిమా జనాల మీద ఎంత ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సదా కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళం ఇండస్ట్రీలను ఏలింది. ముద్దుగా, క్యూట్ గా ఉండే సదా ఆ తర్వాత మాత్రం అవకాశాలను అందుకోలేకపోయింది.
సినిమా అవకాశాలు లేకపోయినా టీవీ షోలలో జడ్జిగా చేస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో తానున్నానని చెబుతోంది. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది ఈ సుందరి. కట్ చేస్తే ఇటీవల సదా చేసిన ఓ పని తన అభిమానులను షాక్ నకి గురి చేసింది. జనాలకు బిగ్ షాక్ ఇచ్చింది. నిజానికి తనకు టాటూస్ అంటే ఇష్టం ఉండదు. ఈరోజుల్లో ఎవరైనా టాటూస్ వేస్తుంటారు కదా. కానీ.. సదాకు టాటూస్ అంటే ఇష్టం ఉండదు అనే విషయం అందరికీ తెలుసు. చాలా సార్లు చాలా స్టేజీల మీద కూడా తను ఇదే విషయం చెప్పింది. తనకు ఇష్టం లేదంటూనే సదా.. ఇటీవల టాటూస్ వేయించుకుంది.
Sadha : చేతి మీద టాటూ వేయించుకున్న సదా
చేతి మీద టాటూ వేయించుకుంది సదా. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో జనాలు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఏంటి సదా నీకు టాటూ అంటే ఇష్టం లేదన్నావు కదా. మళ్లీ వేసుకున్నావు ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నాకు టాటూ అంటే ఇష్టం లేదు కానీ.. జీవితంలో కొన్ని సార్లు మనం ఇష్టం లేని పనులు కూడా ఒక్కోసారి ఇష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను అదే పొజిషన్ లో ఉన్నాను. ఈ టాటూ నాకు నచ్చింది. అందుకే వేయించుకున్నా.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సదా.