Nikhil Siddharth Stops Karthikeya 2 Movie On september 2 For Jalsa Re-Release
Nikhil Siddharth : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానులలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా స్టార్స్ కూడా పవన్‌ని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తుంటారు. ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’ వంటి వరుస బ్లాక్ బాస్టర్ల తర్వాత పవన్ కళ్యాణ్‌కు దాదాపు ఏడేళ్ళ వరకు ఒక్క హిట్టు కూడా లేదు. ఫ్యాన్స్ కోసం ఒక్క సినిమా హిట్టయితే చాలు అని అనుకుంటున్న టైంలో పవన్ ‘జల్సా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు నుండే రికార్డులను క్రియేట్ చేసింది. నైజాంలో 10కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. అందులోని పాటలు ‘సరిగమ పదనిస’, ‘గాల్లో తేలినట్టుందే’, అంటూ సాగే పాటలు అప్పటి కుర్రకారులని ఉర్రూతలు ఊగించాయి. ఇంక మాటల మాంత్రికుడు మాటలు, మహేష్ బాబు వాయిస్ ఓవర్ సినిమాకి మరింత అందాన్ని తెచ్చాయి.
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ అభిమానుల కోరిక మేరకు ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పెషల్ షోస్ గాను మూవీ టీం ఆన్లైన్ లో టికెట్లని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన కొద్దిసేపటికే టిక్కెట్లు అమ్ముడుపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ బర్త్ డే సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 1న ‘జల్సా’ సినిమాను 4కె రెసొల్యూషన్ తో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం రీ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.
Nikhil Siddharth Stops Karthikeya 2 Movie On september 2 For Jalsa Re-Release
వీలైనన్ని ఎక్కువ షోస్ వేసేలా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తుండగా, నిఖిల్ కూడా తన వంతు భాగంగా పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 1 న హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో ‘జల్సా’ రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా కార్తికేయ 2 ను నిఖిల్ పవన్ కోసం ఆపుతున్నడని చెబుతున్నారు. పవన్ అంటే నిఖిల్‌కి పిచ్చి అభిమానం. ఆ కారణం చేతనే నిఖిల్ అలాంటి పని చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నిఖిల్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
This website uses cookies.