Sri Reddy : మెగాస్టార్ చిరంజీవి పై నటి శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు..!!

Authored By Breaking News | The Telugu News | Published on: August 8, 2023, 7:00 pm

Sri Reddy : నటి శ్రీరెడ్డి అందరికీ సుపరిచితురాలే. తెలుగు చలనచిత్ర రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ.. అప్పట్లో ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు విప్పేసి రచ్చ రచ్చ చేసింది. ఆ రకంగా వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి తర్వాత మెగా ఫ్యామిలీ పై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మీడియా ముందు మండిపడింది. అదే సమయంలో 2019 ఎన్నికల టైంలో… రాజకీయాలపై పలు విమర్శలు చేస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

ఆ తర్వాత చెన్నైకి మకాం మార్చేసిన శ్రీ రెడ్డి తన సోషల్ మీడియాలో తాజా పరిణామాలపై ఇండస్ట్రీ పరంగా పొలిటికల్ గా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాది. ఈ రకంగానే తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై శ్రీ రెడ్డి మండిపడింది. “భోళా శంకర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ కీర్తి సురేష్ తో చిరంజీవి చాలా చనువుగా ఉండటం ఆమెపై చేసిన కామెంట్లపై.. ట్విట్టర్ లో మండిపడింది. మేటర్ లోకి వెళ్తే సరిగ్గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే ప్రజా గాయకుడు గద్దర్ మరణించడం తెలిసిందే. సినిమాలో చెల్లెలు పాత్ర, నిజజీవితంలో తన కూతురు వయస్సు ఉన్న, కీర్తీ సురేష్ తో లక్షల మంది ప్రజలు ముందు ఆ చిలిపి పనులు, కామ వేషాలు ఏంటి చిరంజీవి గారు కనీసం గద్దర్ గారికి మౌనం పాటించి వుంటే మీ గౌరవం మరింత పెరిగేది అని కామెంట్ చేయడం జరిగింది.

actress sri reddy outrageous comments on megastar chiranjeevi

actress sri reddy outrageous comments on megastar chiranjeevi

దీంతో శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ శ్రీ రెడ్డి పై మండిపడుతున్నారు. నీతో చెప్పించుకోవలసిన అవసరం తమ అభిమాన హీరోకి లేదని కౌంటర్లు ఇస్తున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp