Trisha – Rana : రానా కి ఆ అమ్మాయితో …?? త్రిష ఇంత పెద్ద మ్యాటర్ లీక్ చేశాక సురేష్ బాబు ఏం చేస్తాడు ఇప్పుడు?
Trisha – Rana : సరిగ్గా రెండు దశాబ్దాల కింద తెలుగు, తమిళం,Telugu, Tamil, ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది త్రిష. నిజానికి తనకు ఒక హీరోయిన్ గా గుర్తింపు ఇచ్చిన సినిమా వర్షం. ఆ సినిమాతోనే తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తను తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన తనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఓ 10 ఏళ్ల పాటు తెలుగు, తమిళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష.. ఆ తర్వాత వయసు మళ్లడంతో ఆఫర్లు తగ్గిపోయాయి. వర్షం తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు సినిమాలతో తనేంటో నిరూపించుకుంది త్రిష.
తమిళంలోనూ సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి సత్తా చాటింది. తెలుగులో స్టార్ హీరోలు, సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించిన త్రిష.. ఆ తర్వాత కొన్ని రోజులు హీరో రానాతో అఫైర్ కొనసాగించిందని వార్తలు వచ్చాయి. కోలీవుడ్ లో శింబుతో కూడా తను అఫైర్ నడిపించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. రానాతో తను పర్సనల్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాళ్ల విషయం అప్పట్లో పెద్ద రచ్చకు దారి తీసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష..
Trisha – Rana : రానా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిష
రానాకు, తనతో ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చింది. నిజానికి రానా తన చిన్ననాటి ఫ్రెండ్ అట. ఇండస్ట్రీకి రాకముందు నుంచే అతడితో పరిచయం ఉందట. రానా చెన్నైలో చదువుకున్న సమయంలో వాళ్ల ఇంటి దగ్గరే త్రిష ఇల్లు కూడా ఉండేదట. అలా.. ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ అప్పుడే స్టార్ట్ అయిందట. అప్పట్లోనే రానా చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలే ఉండేవారట. అమ్మాయిలను వేసుకొని రానా బయట తిరిగే వాడని చెప్పుకొచ్చింది త్రిష. అంతే కాదు.. పెద్ద సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా చాలా సింపుల్ గా ఉంటాడని అందుకే రానాతో ఫ్రెండ్ షిప్ కుదిరిందని త్రిష.. రానా బిహేవియర్ గురించి చెప్పుకొచ్చింది.