Adhire Abhi : మా కుటుంబానికి దిష్టి త‌గిలింది.. అందుకే మాకు మేమే తిట్టుకుంటున్నామ‌న్న అదిరే అభి..!!

Adhire Abhi : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాటు ప‌లు కామెడీ స్కిట్స్ ద్వారా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు అదిరే అభి. బుల్లితెర ఆడియన్స్‌ను తనదైన శైలిలో నవ్విస్తూ.. ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు కమెడియన్ అదిరే అభి. తాను ఎదగడంతో పాటు.. తన టీమ్‌లో ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి జీవితాన్ని ఇచ్చిన అదిరే అభి… జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి ఆ త‌ర్వాత వేరే ఛాన‌ల్‌కి వెళ్లి అక్క‌డ కూడా అల‌రించే ప్రయ‌త్నం చేశాడు. అయితే తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ కొన్ని చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఒక‌ప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద కామెడీ చేసే కమెడియన్లు అందరూ ఒక కుటుంబంలా ఉండేవారు.

Adhire Abhi shares emotional post

మమ్మ‌ల్ని జబర్దస్త్ ఫ్యామిలీ అని అనేవారు. అలాంటి ఫ్యామిలీకి దిష్టి తగిలిందని, మాలో మేమే తిట్టుకుంటున్నామ‌ని కామెంట్స్ చేశారు. త‌న పోస్ట్ లో అభి ఇలా రాసుకొచ్చాడు. ‘మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది. జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్ తో పంచులేసే టీమ్ లీడర్లు, కామెడీని అవపోసన పట్టిన కంటిస్టెంట్లు, అందరికీ అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు, సమయం ఆగేది కాదు. కుశల ప్రశ్నలు, ఆపన్నహస్తాలు, జోకులు మీద జోకులు, స్టూడియో దాటే నవ్వులు. బాబు గారి హుందాతనం, రోజా గారి చిలిపితనం, అనసూయ రష్మీల అందం, స్కిట్ల మాయాజాలం. స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్లు,

Adhire Abhi shares emotional post

Adhire Abhi : అభి ఆవేద‌న‌

అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు’ ఇవేమీ ఇప్పుడు కనబడడం లేదనేలా త‌న పోస్ట్‌లో అభి రాసుకొచ్చాడు. ‘ఎవరి దిష్టి తగిలిందో, ఏక తాటి మీద నడిచిన మాకు ఎవరి దారి వారిదయ్యింది. ఎవడైనా పల్లెత్తి మాట అంటే పడని మేము, మమ్మల్ని మేమే మాటలు అనుకుంటున్నాం. సమయం వెనక్కి వెళ్తే బాగుండు, ఆరోజులు తిరిగి వస్తే బాగుండు. అందరినీ నవ్వించే జబర్దస్త్ కి, మళ్ళీ నవ్వే రోజులు వస్తే బాగుండు అంటూ అదిరే అభి భావోద్వేగంతో కూడిన లెటర్ ను షేర్ చేయ‌గా, ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago