Roja : జబర్దస్త్ రోజా మళ్లీ రావాలని అందరి కోరిక.. ఆమె మాత్రం!
Roja : జబర్దస్త్ కార్యక్రమం నుండి రోజా వెళ్ళి పోయింది. దాదాపుగా పది సంవత్సరాల పాటు ఆమె జడ్జిగా జబర్దస్త్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నడిపించింది అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ చేస్తూనే ఎమ్మెల్యేగా గెలిచింది. ఇటీవలే మంత్రిగా కూడా అయింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా కి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చి గౌరవించాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంత్రి పదవికి పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జబర్దస్త్ గుడ్ బై చెప్పేసింది.
ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో రోజా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా రోజా కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే చాలా మంది జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్ రోజా మళ్ళీ జబర్దస్త్ లో కి రావాలని కోరుకుంటున్నాము అభిప్రాయం వ్యక్తం చేశారు. సుడిగాలి సుదీర్ తో పాటు ఇతర టీం లీడర్లు మరియు ఇతర యూనిట్ సభ్యులు అంతా కూడా రోజా తర్వాత జబర్దస్త్ లో కొత్త చూస్తామని ఆశ వ్యక్తం చేశారు. కానీ రోజా మాత్రం తను మళ్ళీ జబర్దస్త్ లోకి వచ్చే ఉద్దేశం లేనట్లుగానే వ్యవహరించారు.రెండు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వ గడువు తీరుతుంది.
మళ్లీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన కూడా మొదటి దఫా లో రోజా కి అవకాశం వస్తుందా లేదా అనేది అనుమానమే. ఈసారి లాగానే వచ్చేసారి కూడా రెండు దఫాలుగా మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. కనుక మొదటి దశ రోజా కి అవకాశం ఉండక పోవచ్చు అనేది అభిప్రాయం. ఆ సమయంలో రోజా జబర్దస్త్ కు వస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజా మాత్రం ఆ విషయంపై అస్సలు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపించడం లేదు. అందరూ కూడా రోజా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నా ఆమె తన ఉద్దేశ్యం లో మార్పు లేదని ఆమె మాటలు మరియు ఆమె ఎమోషన్లని బట్టి అర్థం అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు మరియు ఇతర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.