Ram Charan : రంగస్థలం తర్వాత నిజంగా రామ్ చరణ్ లో అంత మార్పు వచ్చిందా?
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్ రంగస్థలం ముందు రంగస్థలం తర్వాత అన్నట్లుగా మారిందో లేదో తెలియదు కాని ఆయన జీవితం మాత్రం మారిందట. ఆయన సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు గత కొన్ని రోజులుగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇతర మీడియాల ద్వారా పంచుకుంటున్నారు. ఒకప్పుడు ఆయన జీవితం చాలా రాయల్ గా ఉండేదట. ప్రతీది కూడా గ్రాండ్ గా వైభవంగా ఉండాలని కోరుకునేవాడట. ఆయన ప్రతి రోజు కూడా ఇష్టానుసారంగా ఖర్చు చేసేవాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. కాని ఇప్పుడు ఆయన పూర్తిగా మారి పోయాడు అని.. అందుకు కారణం రంగస్థలంలోని చిట్టిబాబు పాత్ర చేయడం అంటూ స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు బల్ల గుద్ది మరీ చెప్పడం విడ్డూరంగా ఉంది.
సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ ను చిట్టిబాబు గా చూపించాడు. ఆ సినిమా లో చరణ్ కు చెవులు వినిపించవు. అంతే కాకుండా ఒక సామాన్యమైన వ్యవసాయ బోర్లకు జనరేటర్ పెట్టే వ్యక్తి పాత్రలో కనిపించాడు. అలాంటి ఒక సింపుల్ పాత్రను అది కూడా చెవిటి వాడి పాత్ర ను చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒక స్టార్ హీరో తనయుడు.. ఆయనో స్టార్ హీరో అయినప్పుడు అంతటి కింది స్థాయి పాత్రలో నటించాలని ఏ ఒక్కరు అనుకోరు. కాని చరణ్ ఆ పాత్ర పై నమ్మకం మరియు సినిమా కథ కు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో ఆ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.

after Rangasthalam hero ram charan changed more as a person
రంగస్థలం సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఇన్నేళ్లలో చరణ్ నుండి చాలా మార్పు చూడవచ్చు అంటూ వారు అంటున్నారు. ప్రతీ విషయాన్ని ఒకప్పుడు కమర్షియల్ గా చూస్తే రిచ్ గా ఉండేందుకు ప్రయత్నించిన రామ్ చరణ్ ఇప్పుడు అలా కాదట. రిచ్ గా ఉండాల్సిన అవసరం లేదు.. సాదారణంగా ఉన్నా కూడా మనకు ఉన్న పేరు ను బట్టి రిచ్ నెస్ కనిపిస్తుందని భావిస్తున్నాడట. తినే ఆహారం మొదలుకుని ప్రతి విషయంలో కూడా రామ్ చరణ్ వ్యవహార శైలి మారిందని తెలుస్తోంది. చరణ్ మాదిరిగానే ఆయన భార్య ఉపాసన కూడా చాలా సింపుల్ అండ్ స్వీట్ అన్నట్లుగా ఉంటారు. అందుకే ఈ జంట టాలీవుడ్ లోనే చాలా స్పెషల్ అన్నట్లుగా చర్చ జరుగుతూ ఉంటుంది. చరణ్ లో ఇంత మార్పు వచ్చింది అంటే నిజంగా నమ్మశక్యం కావడం లేదు కదా..!