Karthika Deepam Serial : కార్తీక దీపం మళ్లీ గాడిన పడింది.. దీప డాక్టర్ బాబులను మర్చి పోతున్న ప్రేక్షకులు
Karthika Deepam Serial : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు గత అయిదు ఆరు సంవత్సరాలుగా కార్తీక దీపం సీరియల్ ఎంతగా పెనవేసుకు పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా దీప కష్టాల గురించి మాట్లాడుకునే వారు.. దేవుడికి కూడా డాక్టర్ బాబు మనసు మారాలని పూజలు చేసే వారు. మోనిత కు శాపనార్థాలు పెట్టే వారు. అంతగా తెలుగు జనాల్లో కార్తీక దీపం సీరియల్ చొచ్చుకు వెళ్లింది. దీప సీరియల్ అంటూ వృద్దులు అంటే.. డాక్టర్ బాబు సీరియల్ అంటూ కొందరు పిలుచుకునే వారు.మొత్తానికి జెనరేషన్ మార్పు పేరుతో వారిద్దరిని లేకుండా యూనిట్ సభ్యులు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.
కార్తీక దీపం సీరియల్ కు గుడ్ ఎండింగ్ ఇచ్చి శుభం కార్డు వేస్తే పోయేది. జెనరేషన్ మార్పు అంటూ డాక్టర్ బాబు మరియు దీపలను చంపేసి వారి పిల్లలతో సీరియల్ నడపడం ఏంటీ అంటూ మొన్నటి వరకు విమర్శలు వచ్చాయి. దీప మరియు డాక్టర్ బాబు లేని కార్తీక దీపం మేము చూడము అంటూ ప్రతి ఒక్కరు అన్నారు. కాని ఇప్పుడు వాయిస్ చేంజ్ అయ్యింది. ఇద్దరు పిల్లల స్టోరీ మెల్ల మెల్లగా జనాలకు కనెక్ట్ అవుతుంది. ఇద్దరు పిల్లలు పెద్ద వారు అయ్యి వారి వారి వృత్తిలో బిజీ అయ్యారు.వారి మద్య వస్తున్న సన్నివేశాలు మరియు వారి యొక్క పాత్రల తీరు ఇలా ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ బాబు మరియు దీప లేని లోటును మర్చి పోయేలా చేస్తున్నాయి.

again karthika deepam serial get good rating in star maa tv
మెల్ల మెల్లగా మళ్లీ కార్తీక దీపంకు మునుపటి మాదిరిగా జనాలు కనెక్ట్ అవుతున్నారు. దీప డాక్టర్ బాబు లేకుండానే మళ్లీ నెం.1 సీరియల్ గా కార్తీక దీపం నిలువబోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మళ్లీ కార్తీక దీపం సందడి మొదలు అయ్యింది. స్టార్ మా లో మళ్లీ కార్తీక దీపం దూసుకు పోతూ రేటింగ్ విషయంలో గత వారం నుండి టాప్ లో ఉందంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి తెలుగు సీరియల్ మేకర్స్ ఏమైనా చేయగలరని నిరూపించారు.