Comedy Stock Exchange : మూడు వారాల తర్వాత కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ రివ్యూ జనాలు ఏమి అనుకుంటున్నారు..!
Comedy Stock Exchange : తెలుగు ఓటిటి ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న కామెడీ షో ‘కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్’ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించడం లేదు అంటూ స్వయంగా కార్యక్రమ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. జబర్దస్త్ రేంజ్ లో ఈ కామెడీ షో ఉంటుందని అంతా భావించారు. అయితే షో లో ఉన్న వారంతా కూడా జబర్దస్త్ నుండి వెళ్లిన వారే అయినప్పటికీ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ మాత్రం ఆ స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి.
ఆ మూడు ఎపిసోడ్స్ కూడా మినిమం రేటింగ్ దక్కించుకోలేక పోయాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కామెడీ షో లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే విషయం తెలిసిందే. ఇక సుడిగాలి సుదీర్ మరియు దీపిక పిల్లి కలిసి ఈ షో కు యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ షో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అంతా భావించారు, కానీ మొదటి మూడు ఎపిసోడ్స్ కే జనాల తిరష్కరణ కనిపిస్తుంది.
షో కు ఏ మాత్రం రేటింగ్ రాక పోవడంతో ముందు ముందు ఈ షో కొనసాగడం కష్టమే అన్నట్లుగా ప్రచారం మొదలైంది. ప్రస్తుతం షో కి సంబంధించిన వ్యువర్స్ లెక్కలు ముందు ముందు ఈ షో ఉండకపోవచ్చని చర్చకు తెర తీస్తోంది. భారీ అంచనాల నడుమ మొదలైన ఈ షో మరి ఇంత దారుణమైన టాక్ సొంతం చేసుకుంటుందని ఊహించలేదని చాలా మంది అభిప్రాయం చేస్తున్నారు .మొత్తానికి కామెడీ షో లు ఎన్ని వచ్చినా జబర్దస్త్ స్థాయిలో ఉండవని మరోసారి నిరూపితం అయింది.