Comedy Stock Exchange : ‘ఆహా’ కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ .. జబర్దస్త్ కమెడియన్స్ కి గొప్ప వరం కానుందా!
Comedy Stock Exchange : ఈటీవీలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఇంకా కూడా సూపర్ హిట్ అవుతూనే ఉంది. కొత్త కమెడియన్స్ వస్తూనే ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్ లు చాలా మంది సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు, మరి కొందరు వేరే ఛానల్ కి వెళ్లి పోయి అక్కడ ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు. ఈ సమయంలో జబర్దస్త్ కి కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంది. ఇతర టీవీ చానల్స్ నుండి వస్తున్న ఆఫర్స్ కారణంగా జబర్దస్త్ కమెడియన్స్ చాలా మంది ఇప్పటికే వెళ్లారు. ముందు ముందు కూడా వెళ్తారు అనడంలో సందేహం లేదు. ఇతర చానల్స్ వారు రెగ్యులర్ గా జబర్దస్త్ కమెడియన్స్ కి గాలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఆ విషయం పక్కన పెడితే త్వరలో ఆహా ఓటీటీలో కామెడీ స్టాక్స్ ఎక్స్‌చేంజ్ అనే కామెడీ షో ప్రసారం కాబోతుంది. సుధీర్ తో పాటు కామెడీ స్టార్స్ లో కనిపించిన దాదాపు అందరూ కమెడియన్స్ కనిపించబోతున్నారట. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్స్ ఆ కామెడీ కార్యక్రమంలో చేసి ఆహా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయట. ఆ కామెడీ కార్యక్రమం కోసం ఎంతో మంది కామెడీని ప్రేమించే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. జబర్దస్త్ లో ప్రాముఖ్యత లేదని భావించే కొందరు కమెడియన్ ఇతర ఛానల్ కి వెళ్లాలని కొంత కాలంగా భావిస్తున్నారు.

jabardasth comedians waiting for aha Comedy Stock Exchange Stock Exchange for joining
కానీ అక్కడ ఏ ఒక్క కార్యక్రమం నిలకడగా ఉండడం లేదు. కనుక అక్కడికి వెళ్లి ఇబ్బంది పడడం ఎందుకని అనుకున్న వారు ఇక్కడే ఉంటున్నారు. అయితే ఆహా ఓటీటీ లో ఆ కార్యక్రమం వచ్చి సూపర్ హిట్ అయితే కచ్చితంగా జబర్దస్త్ లో ఉండలేక వెళ్లలేక బాధపడుతున్న కమెడియన్స్ కి గొప్ప వరం కానుంది అంటూ బుల్లి తెర విశ్లేషకులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. కామెడీ ఎక్స్చేంజ్ కామెడీ షో తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కామెడీ షో కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఆ కార్యక్రమం స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఆహా టీం అనధికారికంగా ప్రకటించింది.