Aishwarya Rai Daughter : ‘కత్తిలా ఉంది ‘ ఆకాష్ అంబాని ఎంగేజ్మెంట్ లో ఐశ్వర్యారాయ్ కూతురు ని చూసినవాళ్ల కామెంట్స్ ఇవే.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aishwarya Rai Daughter : ‘కత్తిలా ఉంది ‘ ఆకాష్ అంబాని ఎంగేజ్మెంట్ లో ఐశ్వర్యారాయ్ కూతురు ని చూసినవాళ్ల కామెంట్స్ ఇవే.. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :21 January 2023,7:20 pm

Aishwarya Rai Daughter : ఇండియ‌న్ సినీ ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఐశ్వ‌ర్య‌రాయ్. ఒకప్పటి మిస్ వరల్డ్ అయిన ఐష్ త‌న అందంతో పాటు .. కళ్లతో మనసు దోచుకుంటుంది. దేవదాస్, ధూమ్ 2, జోధా అక్బర్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, రోబో, రావణ్, ప్రియురాలు పిలిచింది, సర్కార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి పెళ్లిచేసుకుంది. ఆపై ఆరాధ్య అనే చిన్నారికి జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత ఐష్ సినిమాలు కాస్త తగ్గించారు.

ఫ్యామిలీ, కూతురు ఆద్యకే ఎక్కువ సమయం కేటాయిస్తూ వ‌స్తుంది. అప్పుడు ఐష్‌తో పాటు ఆరాధ్య కూడా తళుక్కున మెరుస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో ఐశ్వ‌ర్య‌రాయ్ రీసెంట్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీకి విరెన్ మర్చెంట్ శైల దంపతుల కుమార్తె రాధిక మర్చెంట్ నిశ్చితార్ధానికి హాజ‌రైంది .ఐష్ త‌నతో పాటు త‌న కూతురు ఆరాధ్య‌ని కూడా తీసుకురాగా అంద‌రి దృష్టి ఆ చిన్నారిపైనే ఉంది. దాదాపుగా ఐశ్వర్య రాయ్ హైట్ కి సమానంగా ఆరాధ్య ఉంది. చూస్తుంటే త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేలా ఉందిగా కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Aishwarya Rai Daughter at ambani engagement

Aishwarya Rai Daughter at ambani engagement

Aishwarya Rai Daughter : త‌ల్లి త‌గ్గ కూతురు..!!

అందుకు కార‌ణం అంత అందంగా ఆరాధ్య ఉంది . ఈవెంట్‌లో ఐశ్వ‌ర్య‌రాయ్.. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనార్కలీ డ్రెస్‌తో పాటు గోల్డెన్ కలర్ హీల్స్ వేసుకొని కనిపించింది. అలాగే ఆమె కూతురు ఆరాధ్య సిల్వర్ అండ్ బ్లూ కలర్ డ్రెస్సులో చంద‌మామ‌లా మెరిసిపోయింది. ఈ క్రమంలోనే కూతురుతో కలిసి ఐశ్వర్యా రాయ్ ఫొటోలకు ఫోజులు ఇవ్వ‌గా, వీటికి సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా ఐశ్వ‌ర్య‌రాయ్ రెండో బిడ్డకు జ‌న్మ‌నివ్వ‌బోతుంద‌ని ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. బేబి బంప్‌తో ఉంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నా కూడా దీనిపై అయితే క్లారిటీ లేదు.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది