Ajay Devgn Daughter : అజ‌య్ దేవ‌గ‌ణ్ కూతురు ఎంత అందంగా ఉంది.. ఇండ‌స్ట్రీకి మ‌రో అంద‌మైన హీరోయిన్ దొరికిన‌ట్టే.. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :17 January 2023,7:00 pm

Ajay Devgn Daughter : బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, కాజోల్ ముద్దుల కూతురు నైసా సినిమాల‌లోకి ఎంట్రీకి ఇవ్వ‌క‌ముందే ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకుంది. బాలీవుడ్ ప్రముఖ స్టార్ కిడ్స్‌లో ఒకరిగా పాపులారిటీ సంపాదించుకుంది నైసా.. అయితే అజయ్ దేవ‌గ‌ణ్‌ మరియు కాజల్ చాలా డీసెంట్‌గా ఉంటారు. అయితే వారి కూతురు నైసా మాత్రం ఉర్ఫీ జావెద్ కంటే 10 రెట్లు అందాల ఆరబోత చేసేలా డ్రెస్సింగ్ వేసుకుంటూ హాట్ టాపిక్‌గా మారుతుంది. నైసా గ్లామ‌ర్ షోని త‌ట్టుకోలేక కొంద‌రి కుర్రాళ్లకి పిచ్చెక్కిపోతుంది. నైసాకి హీరోయిన్‌కి కావ‌ల‌సినంత గ్లామ‌ర్ ఉంద‌ని, త్వ‌ర‌లో ఇండ‌స్ట్రీకి రావాల‌ని కోరుతున్నారు. ఎంట్రీ ప‌క్కానా.. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, కాజోల్ ఎలాగు న‌టులే

కాబ‌ట్టి వారు కూడా త‌మ కూతురిని ఇండ‌స్ట్రీకి తీసుకురానున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆ మ‌ధ్య నైసా ట్రోలింగ్ బారినప‌డింది. ఓ పార్టీలో ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహికా రాంపాల్, ఇతర స్టార్‌కిడ్‌లు క‌నిపించారు. అయితే నైసా, ఓర్రీ చేతులు పట్టుకుని నడుస్తున్న ఈ వీడియో వైరల్ కావడంతో వారిద్దరూ తప్పతాగి వున్నారంటూ కొంద‌రు ట్రోల్ చేశారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే.. వారి పిల్లలు మస్తుగా జల్సా చేస్తున్నారని కామెంట్లు పెట్టారు. నైసా దేవగణ్.. అజయ్, కాజోల్‌లకు మొదటి సంతానం కాగా,

Ajay Devgn Daughter Nysa Spotted With Friends

Ajay Devgn Daughter Nysa Spotted With Friends

ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ కూడా వున్నాడు. ఆ మ‌ధ్య త‌న కూతురి సినిమా ఎంట్రీపై స్పందించాడు అజ‌య్ దేవ‌గణ్. ఒక‌వేళ నా కూతురు ఈ లైన్ (సినిమాల్లోకి) వ‌స్తుందా..? నాకు తెలియ‌దు. ఎందుకంటే ఈ క్ష‌ణం వ‌ర‌కు నైసా సినిమాల ప‌ట్ల‌ అనాస‌క్తిగానే క‌నిపిస్తుంది. పిల్ల‌ల విష‌యంలో ఎప్పుడైనా మార్పులు అనేవి రావొచ్చు. అందువ‌ల్లే నాకు ఇప్పుడు తెలియ‌దు. ప్ర‌స్తుతం నైసా విదేశాల్లో చ‌దువుతోందని చెప్పుకొచ్చాడు అజ‌య్ దేవ్‌గ‌న్‌. అయితే ఒక‌వేళ త‌న కూతురు న‌టి అవ్వాల‌నుకుంటే తాను పూర్తి ఆమెకు స‌పోర్టు చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు అజ‌య్ దేవ్‌గ‌న్‌.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి