Guntur Kaaram Movie : పిచ్చిపిచ్చి రాతలు రాస్తే తాటతీస్తా… గుంటూరు కారం రివ్యూ పై స్పందించిన అజయ్ ఘోష్.. వీడియో !
Guntur Kaaram Movie : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుని నిజ జీవితంలో ఎంతో సింపుల్ గా జీవించే అజయ్ ఘోష్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక ఇతను బ్రతికే విధానం చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే ఎన్ని సినీ అవకాశాలు వచ్చినా ఎన్ని సినిమాలలో నటించిన తన నిజ జీవితంలో మాత్రం ఆయన చాలా సింపుల్ గా జీవనం సాగిస్తుంటారు. అయితే తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా అజయ్ గోష్ ఒక వీడియోను చేయడం జరిగింది. ఇక ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ మొదటగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా గురించి ఆయన కొన్ని విషయాలను చేప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఈ సంక్రాంతికి కానుకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు , శ్రీ లీల గారు అలాగే రమ్యకృష్ణ , ప్రకాష్ రాజ్, నా దొరగారు రావు రమేష్, మురళి శర్మ గారు వీరందరూ కలిసి చాలా బాగా నటించిన సినిమా గుంటూరు కారం మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమాని ఇంటి సభ్యులంతా తప్పకుండా పండుగ సందర్భంగా వెళ్లి కచ్చితంగా చూడాల్సిందిగా ఆయన తెలియజేశారు. ఇకపోతే చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఎందుకో కొంతమంది గుంటూరు సినిమా గురించి నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
సినిమా ఏం బాగాలేదు పోయింది దొబ్బింది అని ఈ విధంగా మాట్లాడుతున్నారు. సరే సినిమా అంటే అందరికీ నచ్చాలని లేదు. కొందరికి నచ్చితే కొందరికి నచ్చదు అది సహజమే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా చూడని వారు కూడా ఈ సినిమా బాగాలేదు అంటూ నెగిటివ్ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. బాగాలేదంట పోయిందంట అంటూ ఈ అంట తోనే పెద్ద తంట అవుతుంది స్వామి. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే అసలు వాస్తవం కాదు స్వామి. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు విపరీతంగా వెళ్తున్నారు. అదేవిధంగా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే మీకు తెలిసిందే కదా.. ఆయన సినిమాలోని ప్రతి డైలాగ్ ని కన్న తల్లిలా ప్రేమిస్తారు. ఇక సినిమాలోని సన్నివేశాలకైతే తండ్రిలా బాధ్యత వహిస్తారు. ఇక కథ విషయానికొస్తే చిన్నపిల్లల్ని పెంచి పోషించి పెద్దద చేసి ఎంత బాధ్యతగా ఉంటారో అంత ఇదిగా మన డైరెక్టర్ ఉంటాడు. మరి ముఖ్యంగా కుటుంబ విలువలు ,కుటుంబ బంధాలను సాంప్రదాయమైన విలువలను , ఆయన సినిమాలో ఎంతో బాగా చూపిస్తారు. అలాంటి దర్శకుడు దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హీరో నటించిన సినిమాను బాలేదంటూ ఫేక్ ప్రచారాలు చేయడం ఏమాత్రం మంచిది కాదు.
ఇక ఈ సినిమాలో అయితే మహేష్ బాబు గారు చాలా కొత్తగా కనిపిస్తారు. అసలు మీరు ఆయన్ని అలా ఊహించుకుని ఉండరు. ఇక హీరోయిన్ శ్రీలీల కూడా మస్తు డాన్స్ చేసింది. యాక్టింగ్ పరంగా డాన్స్ పరంగా శ్రీ లీల ఇరగదీసింది. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయితది.ఇక ప్రకాష్ రాజ్ అన్న గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలే .వీరందరితో సినిమా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఎవరో గిట్ట నోళ్లు సినిమా బాలేదని చెబితే మీరు వెళ్లకుండా ఉండకండి స్వామి. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు . అలాకాకుండా ఎవరి మీద ఉన్న కోపంతో సినిమాని సినిమా తీసిన డైరెక్టర్ హీరోలని కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఆయన తెలియజేశారు. ఇక గుంటూరు కారం సినిమా అయితే కచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అని దానిలో ఎలాంటి సందేహం లేదని ఆయన తెలియజేశారు. అదే విధంగా ఈ సినిమా గురించి ఫేక్ ప్రచారాలు చేసేవారు అలా చేయకండి స్వామి అంటూ ఆయన కోరుకున్నారు.