Akhanda collections : నందమూరి నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ మూవీతో మళ్లీ తానేంటో నిరూపించుకున్నాడు. సినిమా హిట్ టాక్ రావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. థియేటర్ల వద్ద ఈలలు, గోలలు తప్పా ఏం వినిపించడం లేదు. బాలయ్యలో ఇన్నిరోజులు దాగియున్న పవర్ హౌజ్‌ను బోయపాటి శ్రీను బయటకు తీశారంటూ ఫుల్లు ఏంజాయ్ చేస్తున్నారు. ఇదే మా బాలయ్య అంటూ రోడ్ల మీద కూడా ఫ్యాన్స్ ‘జై బాలయ్య జైజై బాలయ్య’ అంటూ కేకలు పెట్టుకుంటూ పోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ‘అఖండ మూవీ’ ఏ రేంజ్‌లో ఉందో..
బోయపాటి శ్రీనుతో బాలయ్య చేసిన మూడో సినిమా ‘అఖండ’ మూవీ మార్నింగ్ షోతేనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎట్టకేలకు దర్శకుడు శ్రీను, బాలయ్య బాబుకు హ్యాట్రిక్ పడిందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బోయపాటి బాలకృష్ణతో ఇంతకు ముందు తీసిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘అఖండ’తో మరో హిట్ పడటంతో వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్‌గా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత నందమూరి ఫ్యాన్స్ అఖండ అద్భుత విజయాన్ని తెగ ఏంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజే కలెక్షన్ల వరద పారించడంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి తిరుగుతున్నారట..
తొలి షోతోనే హిట్ టాక్ రావడంతో నెమ్మదిగా సినిమాకు ఆడియెన్స్ క్యూ కట్టారట.. దీంతో కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల తొలి రోజే అఖండ మూవీకి రూ. 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ కలెక్షన్లు వచ్చాయి. విడివిడిగా చూసుకుంటే నైజాం- 4.39 కోట్లు, సీడెడ్- 4.02 కోట్లు, ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు, ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు, వెస్ట్ గోదావరి- 96 లక్షలు, గుంటూరు- 1.87 కోట్లు, కృష్ణా- 81 లక్షలు, నెల్లూరు- 93 లక్షలుగా ఉన్నాయి.ఇక అఖండ సినిమా విడుదలకు ముందే రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు భారీగా పెరుగుతాయని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.