Pawan kalyan ఆంధ్రప్రదేశ్‌లో బెన్ ఫిట్ షో ల రద్దు అనేది నోటి మాట మాత్రమే అని మరోసారి రుజువు అయింది. ఏపీ లో ఏ భారీ చిత్రం విడుదల అయిన ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచే అభిమానుల హంగామా షురూ అవుతుంది. బెన్ ఫిట్ షో ల పేరిట తెల్లవారు జామునే అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కడుతూ ఉంటారు. అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు… లాస్ట్ సమ్మర్ లో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’కు ఏర్పాటు చేసిన బెనిఫిట్ షోలన్నీ రద్దయిపోయాయి. తీరా సినిమా విడుదల అయ్యే సమయానికి ప్రభుత్వం ఇలా కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో అప్పట్లో పవన్ అభిమానుల ప్రభుత్వం ఫైర్ అయ్యారు. రాజకీయాలను సినిమాలతో ముడి పెడుతున్నారంటూ మండి పడ్డారు.
పవన్ ను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక ఆయన సినిమాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. ఇకపై బెనిఫిట్ షోలనేవే ఉండవని తేల్చేస్తూ జీవోను రిలీజ్ చేసింది. రోజుకు 4 షోలు మాత్రమే ఉంటాయని.. అదనపు షోలకు ఛాన్స్ లేదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో బాలయ్య ‘అఖండ’ సినిమా విషయంలో ఏం జరుగుతుందొనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అఖండకు.. బెనిఫిట్ షోలు ఉండవని అంతా భావించారు. కానీ వారి ఊహలకు బ్రేక్ వేస్తూ ఏపీలో నిన్న అనేక చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. తిరుపతి పట్టణం అయితే దాదాపు అన్ని థియేటర్‌లోనూ అఖండకు స్పెషల్ షోలు రన్ చేస్తున్నారు. దీనిపై పవన్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
పవన్ కొక న్యాయం బాలయ్య కొక న్యాయమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వైపు నుంచి డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా అభ్యంతరాలు రావాట్లేవని సమాచారం. ఇలాగే కొనసాగితే తర్వాతి భారీ చిత్రం ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’కు కూడా ఈ సమస్య తొలగిపోయినట్లే. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే బాలయ్య సినిమాకు పర్మిషన్ ఇచ్చినట్లే పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’ కు కూడా ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేసినట్లే ఉద్దేశపూర్వకంగా ఈసారి కూడా టార్గెట్ చేస్తే పవన్ అభిమానుల నుంచి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదనే చెప్పాలి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.