Akhil Agent Movie : ఏజెంట్ సినిమా కి ఎంత వస్తే హిట్ అవుతుంది ? ఫుల్ లెక్కలు మీకోసం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akhil Agent Movie : ఏజెంట్ సినిమా కి ఎంత వస్తే హిట్ అవుతుంది ? ఫుల్ లెక్కలు మీకోసం !

 Authored By prabhas | The Telugu News | Updated on :27 April 2023,6:00 pm

Akhil Agent Movie : అఖిల్ అక్కినేని ఎన్నడు లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్ తో ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 28న భారీ అంచనాలతో విడుదల కాబోతుంది. అఖిల్ గత సినిమాలు వసూళ్లు బిజినెస్ అవేమీ పట్టించుకోకుండా డైరెక్టర్ అనిల్ సుంకర ఈ సినిమాపై 80 కోట్ల బడ్జెట్ పెట్టడం ఆశ్చర్యకరం. ఇప్పటిదాకా అఖిల్ నాలుగు సినిమాలు చేస్తే అందులో మూడు సినిమాలు డిజాస్టర్, ఒక్క సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. అలాంటిదే ఇప్పుడు 80 కోట్ల బడ్జెట్ తో రావడం అంటే మాటలు కాదు.

Akhil Agent movie movie business

Akhil Agent movie movie business

బడ్జెట్ కు తగినట్లు బిజినెస్ అయితే కాలేదు కాని ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే బిజినెస్ బెటర్ గా జరిగినట్లే. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 36.25 కోట్లకు అమ్మారట అనిల్ సుంకర. నైజాం ఏరియాలో ఏజెంట్ సినిమా హక్కులను 10 కోట్లకు అమ్మారు. రాయలసీమలో 4.5 కోట్లు, ఆంధ్రాలో అన్ని ఏరియాలో కలిపి 14.80 కోట్లకు అమ్ముడు అయ్యాయి. ఏపీ, తెలంగాణలో కలిపి 29.3 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ.3.8 కోట్లు పలికాయి. ఓవర్సీస్ రైట్స్ రూ.3.1 కోట్లకు అమ్మారు. మొత్తం వరల్డ్ వైడ్ గా ఏజెంట్ సినిమా థియేట్రికల్ హక్కులు 36.2 కోట్లు అన్నమాట.

Agent: Akhil Akkineni Starrer's Post Theatrical Rights Acquired By Amazon  Prime Video

అంటే ఈ సినిమా 37 కోట్ల వసూళ్లను సాధిస్తే లెక్క సరిపోతుంది. గ్రాస్ కలెక్షన్లు 60 కోట్ల దాక రావాల్సి ఉంటుంది. మరీ అఖిల్ ఏజెంట్ సినిమాతో ఈ రేంజ్ లో వసూళ్లను సాధిస్తాడో లేదో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే అఖిల్ కి టాలీవుడ్ లో తిరుగు ఉండదు. పాన్ ఇండియా స్థాయిలో తనకి మార్కెట్ పెరుగుతుంది. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఇప్పటికే అఖిల్ సినిమా ప్రమోషన్స్ లో చాలా కష్టపడ్డాడు. భారీ యాక్షన్ గా తెరకెక్కిన ఈ చిత్రం అఖిల్ పేరు నిలబడుతుందో లేదో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది