Akira Nandan : తండ్రి సినిమా గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన అకీరా నందన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akira Nandan : తండ్రి సినిమా గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన అకీరా నందన్..!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 December 2022,8:00 pm

Akira Nandan : ఇటీవల యంగ్ డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. వీరిద్దరి కాంబినేషన్ అనగానే అందరూ షాక్ అవుతున్నారు. అలాంటిది ఏకంగా అధికారిక ప్రకటన చేసే సర్ప్రైజ్ చేశారు. ఇది ఇండస్ట్రీ సహా అతన్ని ట్రోల్ చేసిన వారికి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సుజిత్ సాహో తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలకు గురయ్యాడో తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఏకంగా పవన్ తోనే సినిమా చేస్తున్నట్లు ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమా కోసం ప్రభాస్, రాంచరణ్, మంచు మనోజ్ ఎంతో ఎదురు చూస్తున్నారు.పవన్ సుజిత్ కాంబినేషన్ సినిమా అనగానే సోషల్ మీడియాలో విషేష్ తెలియజేశారు. యంగ్ హీరో అడవి శేషు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. సుజిత్ తన ఫ్రెండ్ కావడంతో ఇంకా ఎక్సైట్మెంట్తో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కాంబినేషన్ కోసం పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలియజేశారు. సుజిత్ కి సాహో తర్వాత బాలీవుడ్ లో రెండో ఆఫర్లు వచ్చాయి కానీ తెలుగు పై ఇష్టం ఉండడం

Akira Nandan comments about Pawan Kalyan new movie

Akira Nandan comments about Pawan Kalyan new movie

తో ఆ సినిమాలను వదులుకున్నాడు. పవన్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నేనే అందరికన్నా ఎక్కువ సంతోషపడ్డ, నా అభిమాన నటుడితో సుజిత్ పని చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్న అన్నారు. సుజిత్ మొదటి సినిమా రన్ రాజా రన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బాలీవుడ్ లో ఈ సినిమా బాగానే ఆడింది. అందుకే సుజిత్ కి బాలీవుడ్లో అవకాశాలు ఇచ్చాయి. కానీ వాటిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి కళ్యాణ్ తో ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది