‘బాస్’ నుంచి ‘వైల్డ్ డాగ్’ వరకు.. నాగ్‌పై అలీ రెజా కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

‘బాస్’ నుంచి ‘వైల్డ్ డాగ్’ వరకు.. నాగ్‌పై అలీ రెజా కామెంట్స్

 Authored By uday | The Telugu News | Updated on :23 December 2020,11:30 am

బిగ్ బాస్ షోకి రాకముందు అలీ రెజా అంటే చాలా మందికి తెలియదు. బుల్లితెరపై సీరియల్స్‌లో నటిస్తాడని కొంత మందికి తెలుసు. కానీ అదే అలీ రెజా ధృవ సినిమాలో రామ్ చరణ్ ఫ్రెండ్, పోలీస్ ఆఫీసర్ పాత్రను వేశాడని ఎవ్వరికీ తెలియదు. బిగ్ బాస్ షోలోకి వెళ్లాకే ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో మాత్రం అలీకి మంచి పేరు తెచ్చింది. హ్యూమన్ బుల్డోజర్, అర్జున్ రెడ్డి అంటూ ఇలా అతనికి ఉన్న కోపంపై రకరకాల పేర్లు పెట్టారు.

బాస్ నుంచి వైల్డ్ డాగ్ వరకు నాగ్‌పై అలీ రెజా కామెంట్స్

Ali Reza starts Journey From Nagarjuna Boss Movie

మొత్తానికి బయటకు వచ్చిన తరువాత అలీ రెజా ఫాలోయింగ్ పెరిగింది. అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. ఏకంగా నాగార్జున పక్కనేనటించే చాన్స్ కొట్టేశాడు. నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో ఓ ఆఫీసర్‌గా అలీ రెజా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మనాలీలో షూటింగ్ కూడా పూర్తి చేసేశారు. తాజాగా ఈ మూవీ గురించి అలీ రెజా మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టేశాడు. నాగార్జున బాస్ సినిమాలో అలీ రెజా నటించాడట. ఇదే విషయాన్ని చెబుతూ తన ప్రయాణం గురించి తెలిపాడు.

వైల్డ్ డాగ్ గురించి షూటింగ్ చేసిన ప్రతీ నిమిషాన్ని నేను ప్రేమించాను.. కింగ్ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోవడమనేది నా కల నెరవేరడం లాంటింది.. బాస్ (2006) మూవీ నుంచి జూనియర్ ఆర్టిస్ట్‌గా నా సినీ ప్రయాణం మొదలైంది. అలా మొదలైన ప్రయాణం ఇలా వైల్డ్ డాగ్ సినిమాలో అతి ముఖ్యమైన పాత్రను పోషించే వరకు వచ్చింది. ఇలా రావడానికి నాకు 14 ఏళ్లు పట్టింది. కానీ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నడూ కూడా నేను వదిలేయలేదు.. దానికి బదులు రెట్టించి కష్టపడ్డాను.. నా కలను సాకారం చేసుకున్నాను.. బిగ్ బాస్ ఇంటి నుంచి ఇక్కడి వరకు తీసుకువచ్చిన నాగార్జున గారికి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదంటూ సినిమా త్వరలోనే విడుదల కాబోతోందని తెలిపాడు.

Advertisement
WhatsApp Group Join Now

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది